Kuwait: 226 మంది ప్రవాసులు అరెస్ట్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..!
ABN, First Publish Date - 2023-11-26T08:30:22+05:30
గడిచిన కొంత కాలంగా ఉల్లంఘనదారులపై గల్ఫ్ దేశం కువైత్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు.
కువైత్ సిటీ: గడిచిన కొంత కాలంగా ఉల్లంఘనదారులపై గల్ఫ్ దేశం కువైత్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాలలో అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior), భద్రతాధికారులు, పోలీసులు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో వివిధ ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులు భారీ మొత్తంలో పట్టుబడుతున్నారు. ఇదే కోవలో తాజాగా కువైత్‌లోని పలు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఏకంగా 226 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖైతాన్, షువైఖ్ ఇండస్ట్రియల్ సిటీ, ముబారకియా, ఫహాహీల్ ఏరియాలలో చేపట్టిన సోదాలలో ఇలా భారీగా ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో చాలామంది రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Saudi Arabia: డొమెస్టిక్ వర్క్ వీసాకు కొత్త కండిషన్ పెట్టిన సౌదీ.. ఇకపై..
ఇక అదుపులోకి తీసుకున్న ఉల్లంఘనదారులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. వారి నేర తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు మాట్లాడుతూ.. రెసిడెన్సీ చట్టాన్ని (Residency law) ఉల్లంఘించిన వారిపై సెక్యురిటీ క్యాంపెయిన్స్ మునుముందు కూడా ఇలాగే అన్ని గవర్నరేట్‌లలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లో ఆశ్రయం కల్పించవద్దని పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.
Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?
ఇదిలాఉంటే.. గడిచిన రెండేళ్ల నుంచి ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్.. ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించడం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లోనే 3,837 మందిని దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరిలో 2,272 మంది పురుషులు, 1,565 మంది మహిళలు ఉన్నారు. కాగా, వీరిలో ఎక్కువ మంది పారిపోయిన కార్మికులు ఉండగా, మిగతా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డవారు ఉన్నారని వివిధ సెక్టార్లకు చెందిన భద్రతాధికారులు తెలిపారు. అలాగే ఆగస్టులో 3,848 మంది దేశం నుంచి బహిష్కరించింది కువైత్. ఇలా రెండు నెలల్లో కలిపి రికార్డు స్థాయిలో ఏకంగా 7,685 మంది ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించింది.
Mahzooz raffle draw: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.45కోట్లు!
Updated Date - 2023-11-26T08:30:23+05:30 IST