America's Gun Culture: ఆడుకుంటూ ఎంత పని చేసింది బుడ్డది.. హ్యుస్టన్లో విషాదకర ఘటన..!
ABN, First Publish Date - 2023-03-15T07:03:03+05:30
అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది.
ఆడుకుంటూ అక్కను తుపాకీతో కాల్చిన చెల్లి
మూడేళ్ల చిన్నారి చేతిలో నాలుగేళ్ల బాలిక హతం
హ్యుస్టన్, మార్చి 14 : అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. అభంశుభం తెలియని ఓ మూడేళ్ల బాలిక చేతిలో అనుకోకుండా పేలిన తుపాకీ.. నాలుగేళ్ల వయస్సున్న ఆమె అక్క ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాదకర ఘటన ఉత్తర హ్యుస్టన్లోని ఓ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బాలికలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్నారు. పిల్లలిద్దరూ ఓ గదిలో ఆడుకుంటుండగా.. తల్లిదండ్రులు వారి పనుల్లో వాళ్లు ఉన్నారు. అయితే, లోడ్ చేసి ఉన్న ఓ సెమీ ఆటోమెటిక్ పిస్టల్ మూడేళ్ల పాపకి దొరికింది. ఆ చిన్నారి తుపాకీని పేల్చగా.. బయటకొచ్చిన తూటా తగిలి ఆమె అక్క అక్కడికక్కడే కన్నుమూసింది.
Updated Date - 2023-03-15T07:03:03+05:30 IST