ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: 4 ఫేక్ గృహ కార్మికుల నియామక ఆఫీసులపై దాడి.. 289 మంది ప్రవాసులు అరెస్ట్..!

ABN, First Publish Date - 2023-11-05T09:14:15+05:30

గడిచిన కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది.

కువైత్ సిటీ: గడిచిన కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. భద్రతాధికారులు, అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) సంయుక్తంగా క్రమం తప్పకుండా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రవాసులపై ప్రధానంగా దృష్టిసారించడం జరుగుతోంది. ఇక సోదాల్లో పట్టుబడ్డ ప్రవాసులను అదుపులోకి తీసుకుని బహిష్కరణ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఆయా జాతీయుల రాయబార కార్యాలతో సంప్రదింపుల అనంతరం అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి, దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది కువైత్.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

ఇదే కోవలో తాజాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ (General Administration of Residence Affairs Investigation) నాలుగు ఫేక్ గృహ కార్మికుల నియామక ఆఫీసులలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలో ఏకంగా 289 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫహాహీల్, జహ్రా, ముబారక్ అల్-కబీర్, సల్వా, ఫర్వానియా, వఫ్రా ప్రాంతాలలో నిర్వహించిన ఈ సోదాల్లో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా దేశంలో ఉంటున్న 289 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో 105 మంది కేవలం వఫ్రా ప్రాంతంలోనే పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. మునుముందు కూడా ఈ సెక్యూరిటీ తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. తాజాగా పట్టుబడ్డ 289 మందిని న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.

Kuwait: ప్రవాసులకు కువైత్ ఝలక్.. వర్క్ పర్మిట్ రెన్యువల్‌ నిలిపివేత..!

Updated Date - 2023-11-05T09:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising