ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అంటున్న కువైత్.. 3నెలల్లో 9వేల మందిని వెళ్లగొట్టింది.. అందులోనూ మనోళ్లే అధికం..!

ABN, First Publish Date - 2023-04-07T08:14:10+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. గడిచిని ఐదేరేళ్లుగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) పేరిట ప్రవాసులకు చుక్కలు చూపిస్తున్న గల్ఫ్ దేశం.. ఇక ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే అంతే సంగతులు. ఏకంగా దేశం నుంచి గెంటేస్తోంది. ఇలా గడిచిన మూడు నెలల్లో ఏకంగా తొమ్మిది వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది (Deported). ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి చివరి వరకు వివిధ దేశాలకు చెందిన సుమారు 9వేల మందిని దేశం నుంచి వెళ్లగొట్టినట్లు అక్కడి మీడియా ద్వారా తెలిసింది.

ఇలా దేశం నుంచి బహిష్కరించినబడిన వారిలో భారతీయులే (Indians) అధికంగా ఉన్నారు. మన తర్వాత ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ, శ్రీలంక వాసులు, ఈజిప్టియన్లు ఉన్నారు. ఇక ఇలా దేశ బహిష్కరణకు గురైన 9వేల మందిలో ఏకంగా 4వేల మంది వరకు మహిళలు ఉండడం గమనార్హం. కాగా, వీరికి క్రిమినల్, దుష్ప్రవర్తన కేసులలో ప్రమేయం ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారని మీడియా ఏజెన్సీలు వెల్లడించాయి.

UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. లైసెన్స్ లేకుండా ఆ పని చేశారో.. రూ.2.23కోట్ల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు!


అంతేగాక మరో 700 మంది ప్రవాసులు (Expatriates) ప్రస్తుతం బహిష్కరణ కేంద్రంలో (Deportation Center) ఉన్నారట. వీరిని కూడా త్వరలోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి మరో 10 రోజుల్లో వారివారి దేశాలకు పంపించేందుకు కువైత్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక బహిష్కరణకు గురైనవారిలో అత్యధికులు మాదకద్రవ్యాల కేసులతో ప్రమేమం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో కువైత్‌లో డ్రగ్స్ కేసులు కూడా భారీగా పెరిగాయని తెలుస్తోంది. రెండో స్థానంలో వీసా గడువు ముగిసినవారు, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉంటున్నట్లు సంబంధిత అధికారుల సమాచారం.

Abu Dhabi Big Ticket: రూ.45కోట్లు గెలిచిన భారతీయుడు.. తీరా లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..!

Updated Date - 2023-04-07T08:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising