ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారీగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కువైత్..!

ABN, First Publish Date - 2023-08-16T11:03:41+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఏకంగా 913 మంది ప్రవాసుల (Expats) డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఏకంగా 913 మంది ప్రవాసుల (Expats) డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. వీటిలో చాలా వరకు అక్రమమార్గంలో పొందినవి ఉంటే, మరికొన్ని స్టేటస్ అప్‌డేట్ చేయనివిగా సంబంధిత అధికారులు గుర్తించారు. అందుకే భారీ మొత్తంలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, రద్దు అనేది మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంది. అలాగే నేర తీవ్రతను బట్టి కొన్నింటిని మాత్రం శాశ్వతంగా క్యాన్సిల్ చేశారు.

ఇక డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం చేస్తే రెండు పెనాల్టీ పాయింట్స్, రెడ్ సిగ్నల్ జంపింగ్ లేదా స్పీడ్ డ్రైవింగ్‌కు నాలుగు పెనాల్టీ పాయింట్లు ఉంటాయని ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. ఇలా ఎవరికైతే 14 పెనాల్టీ పాయింట్స్ ఉంటాయో మొదటిసారి వారి డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licenses) అనేది మూడు నెలలు క్యాన్సిల్ అవుతోంది. అదే డ్రైవర్ మళ్లీ ఉల్లంఘనకు పాల్పడి అదనంగా మరో 12 పాయింట్స్ అతని ఖాతాలో చేరితే 6నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. మరోసారి అదనంగా 10 పాయింట్స్ పొందితే 9 నెలలు క్యాన్సిల్ చేస్తారు. మళ్లీ అదనంగా 8 పాయింట్లు జమ అయితే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. ఇంకోసారి 6 పాయింట్స్ చేరితే మాత్రం శాశ్వతంగా క్యాన్సిల్ అవుతుంది.

ఇక ప్రవాస విద్యార్థులు స్టడీ సమయంలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్లను అప్‌డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తుండడంతో వాటిని కూడా క్యాన్సిల్ చేస్తోంది. చదువు అయిన తర్వాత ఉద్యోగంలో చేరిన కూడా చాలామంది స్టేటస్ మార్చుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ను అలాగే వాడుతుండడంతో అధికారులు అలాంటి వాటిని భారీ మొత్తంలో రద్దు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేయాలని కువైత్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Indian Student: 'ఇది కదా దేశభక్తి అంటే'.. ఈ భారతీయ విద్యార్థి వీడియో చూస్తే గూస్‌బమ్స్‌ రావడం పక్కా!

Updated Date - 2023-08-16T11:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising