ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains: యూఏఈలో భారీ వర్షం.. దుబాయ్, షార్జాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!

ABN, First Publish Date - 2023-11-05T12:16:31+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు పొటెత్తాయి. ఇక రహదారులపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో జలశయాలను తలపిస్తున్నాయి.

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు పొటెత్తాయి. ఇక రహదారులపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో జలశయాలను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో జాతీయ వాతావరణ కేంద్రం (National Centre of Meteorology) పలు ఎమిరేట్స్ ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. దట్టంగా కమ్ముకున్న మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలతో పాటు కొన్ని అంతర్గత ప్రదేశాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం విడుదల చేసిన మ్యాప్ ప్రకారం అబుదాబి, దుబాయ్, షార్జాతో పాటు ఇతర కొన్ని ఎమిరేట్స్ ప్రాంతాలలో ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అందుకే ఆయా ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

NRI Homecoming festival: ఎన్నారైల కోసం ఇండస్‌ఇండ్ బ్యాంక్ సూపర్ స్కీమ్.. అదిరిపోయే ప్రయోజనాలు..

ఇక దేశంలోని తూర్పు ప్రాంతాలు ఆకస్మిక వరదలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. కనుక నివాసితులు ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఎన్‌సీఎం (NCM) హెచ్చరించింది. వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రహదారి వెంబడి ఉన్న ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులపై కనిపించే వేగ పరిమితుల (Speed Limits) ను ఎట్టిపరిస్థితులు వాహనదారులు దాటకూడదని హెచ్చరించింది. ఈ విషయమై అబుదాబి పోలీసులు శ్రద్ధ వహించాలని సూచించింది. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని పేర్కొంది.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

ఈ సందర్భంగా షార్జా, అజ్మాన్‌లలో మెరుపులు, ఉరుములతో కురిసిన వర్షం తాలూకు వీడియోలను సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తుపాన్ కేంద్రం (Storm Center) షేర్ చేసింది. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా ఎమిరేట్స్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. అబుదాబిలో 26 డిగ్రీల సెల్సియస్‌, దుబాయిలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పర్వత ప్రాంతాలలో ఈరోజు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Kuwait: ప్రవాసులకు కువైత్ ఝలక్.. వర్క్ పర్మిట్ రెన్యువల్‌ నిలిపివేత..!

Updated Date - 2023-11-05T12:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising