ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Georgia mass shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. నలుగురు మృతి!

ABN, First Publish Date - 2023-07-16T09:24:31+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జార్జియా: అగ్రరాజ్యం అమెరికా (America) మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. జార్జియా రాష్ట్రం హెన్రీ కౌంటీ (Henry County) లోని హాంప్టన్‌‌లో ఓ సాయుధుడు శనివారం కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు విచక్షరహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు హాంప్టన్‌ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ వెల్లడించారు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా, నిందితుడిని హాంప్టన్‌కు చెందిన 40 ఏళ్ల ఆండ్రే లాంగ్‌మోర్‌ (Andre Longmore) గా పోలీసులు గుర్తించారు. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 10వేల డాలర్లను రివార్డుగా ఇస్తామని హెన్నీ కౌంటీ పోలీస్ ఉన్నతాధికారి రెజినాల్డ్ స్కాండ్రెట్ (Reginald Scandrett) ప్రకటించారు. కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు అదే ప్రాంతంలో దాదాపు 5 గంటల పాటు తిరిగిన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఏడాదిలో యూఎస్ (US) లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 31 కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా.. సుమారు 153 మంది మృతిచెందారు.

Bilateral Trade in Rupee: యూఏఈ, భారత్‌ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.. ఇకపై వాణిజ్య చెల్లింపులన్నీ లోకల్ కరెన్సీల్లోనే..!


Updated Date - 2023-07-16T09:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising