Old Man Kisses Male Flight Attendant: వామ్మో! పీకలదాకా తాగి విమానంలో వృద్ధుడు చేసిన రచ్చ అంత ఇంత కాదు.. మగ అటెండెంట్‌తోనే మిస్ బిహేవ్..!
ABN, First Publish Date - 2023-04-23T13:43:06+05:30
అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్‌లో (Delta Airlines) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్‌లో (Delta Airlines) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూటుగా మద్యం తాగిన ఓ ముసలాయన రెచ్చిపోయాడు. పీకల దాకా తాగిన వృద్ధుడు మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తించాడు. వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన మగ అటెండెంట్‌ను గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు (Old Man Kisses Male Flight Attendant). 61ఏళ్ల వృద్ధుడు డేవిడ్ అలన్ బర్క్ (David Alan Burk) ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అలాస్కా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన అతడికి.. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కావడంతో.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు వరకు ఆల్కహాల్ సేవించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇది బర్క్‌కు కోపాన్ని తెప్పించింది. డ్రింక్స్ సర్వ్ (Drink) చేయాలని సిబ్బందిలో ఓ అటెండెంట్‌ను కోరగా అతడు తిరస్కరించాడు. దాంతో బర్క్ అతడిపై కోపం పెంచుకున్నాడు.
కాసేపటి తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయింది. దాంతో సిబ్బంది ప్రయాణికులకు డ్రింక్ సర్వ్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో బర్క్‌కు అంతకుముందు డ్రింక్ సర్వ్ చేయడానికి నిరాకరించిన అటెండెంట్.. అతడి దగ్గరికి వచ్చి, మందు సర్వ్ చేసి వెళ్లిపోయాడు. ఇక పీకల దాకా తాగిన బర్క్‌కు కిక్కు బాగా ఎక్కేసింది. దాంతో తనకు మందు సర్వ్ చేయకుండా వాగ్వాదానికి దిగిన అటెండెంట్‌ను దగ్గరికి పిలిచి ముద్దు కావాలని అడిగాడు. వృద్ధుడి కోరికతో అటెండెంట్ షాక్ అయ్యాడు. ఒక మగాడు మరో మగాడిని కిస్ అడగటం ఏంటని బిత్తరపోయాడు.
US Visas: భారతీయులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది మనోళ్లకు భారీగా వీసాలు..!
ముద్దు ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లబోయాడు.. అంతే.. బర్క్ రెచ్చిపోయాడు. అటెండెంట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. బలవంతంగా అతడి మెడపై ముద్దు పెట్టాడు. దాంతో ఆ అటెండెంట్ నివ్వెరపోయాడు. వృద్ధుడి విపరీత చర్యతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత బాధిత అటెండెంట్ విమానాశ్రయ అధికారులకు బర్క్‌పై ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. అయితే, తనపై అటెండెంట్ చేసిన ఆరోపణలను బర్క్ ఖండించాడు. తాను అసలు మద్యం మత్తులోనే లేనని, అటెండెంట్‌ను కిస్ చేశానని చెప్పడం అబద్ధమని బుకాయించాడు. కాగా, బర్క్‌ను దుష్ప్రవర్తన ఆరోపణలపై ఈ నెల 27న కోర్టులో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన
Updated Date - 2023-04-23T13:43:06+05:30 IST