ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ATA: ఓర్లాండోలో 'ఆటా' వారి బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2023-10-27T07:39:30+05:30

అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఓర్లాండోలో అక్టోబర్ 15వ తేదీన నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

ATA: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఓర్లాండోలో అక్టోబర్ 15వ తేదీన నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెలుగుదనం ఉట్టి పడేలా దాదాపు 200 మంది ఆడపడుచులందరూ గౌరమ్మ తల్లిని పులకింప చేశారు. ఈ పండుగను బొమ్మా రాధికా ఆతిథ్య సహాకారంతో వొంగురు విజయ్, రీజినల్ కోఆర్డినేటర్ ప్రశాంతి రెడ్డి, నేషనల్ విమెన్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఓర్లాండోలో ఇదొక తెలుగు ఉత్సవ వేడుకగా ఉత్సాహన్ని నింపి మాతృభూమిని తలపింపచేసింది.

ఓర్లాండో ఆటా బృందం మాధురిమ పాతూరి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ లీగల్ కమిటీ చైర్ డాక్టర్ బుచ్చి రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ లోకల్ ఎగ్జిక్యూటివ్ మహేందర్ ఆనేపల్లి, కమిటీ మెంబర్ డాక్టర్ నీలిమ కటుకూరి ఈవేడుకలు విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాన్ని అందజేశారు.

నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని పాలుపంచుకున్నారు. దాదాపు 150 మందికి పైగా పాల్గొన్న ఈ ప్రైవేట్ కార్యక్రమంలో మధు బొమ్మినేని మాట్లాడుతూ అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో ఎన్నో నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.

కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 జూన్ 7-9 తారీఖులలో అట్లాంటాలో జరుగనున్న 18వ ఆటా కన్వెన్షన్‌లో అందరూ పాల్గొని ఈ మహా సభలను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2023-10-27T07:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising