ATA: 'ఆటా' బోర్డు మీటింగ్ విజయవంతం
ABN, First Publish Date - 2023-05-09T08:08:16+05:30
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మే 6న (శనివారం) డాలస్‌లో జరిగిన బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది.
ఎన్నారై డెస్క్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) మే 6న (శనివారం) డాలస్‌లో జరిగిన బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మి నేని ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, పాలకమండలి బృంద సభ్యుల ఆధ్వర్యంలో ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజనల్ అడ్వయిజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, ఉమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వయిజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు.
ఆటా సంస్థ అధ్యక్షురాలు మధు బొమ్మి నేని 2023 సంవత్సరములో జనవరి నుండి ఏప్రిల్ వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ముందుగా వివిధ నగరాలలో ముమ్మరంగా జరిపిన 18 మహిళా దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు జరగడం ఇదే మొదటిసారి అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇమిగ్రేషన్ వెబినార్, హోలి, ఇల్లు లేని వారికి ఆహార సరఫరా సేవా, మహిళలకు రంగోలి, వంటల పోటీలు, మహిళల క్రికెట్, త్రోబాల్ క్రీడా కార్యక్రమాలు, ఆటా డే ఉత్సవాలు చేసిన ఆటా కార్యవర్గ బృందాన్ని కొనియాడుతూ వారికి ఉన్న ఉత్సాహానికి, సేవా నిరతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ వారము ఆటా కొనసాగిస్తున్న యోగా కార్యక్రమములో పాల్గొని, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా వాసులందరికి పిలుపునిచ్చారు.
సంస్థ అందజేస్తున్న టెక్నా లజీ, ఉన్నత విద్యా భివృద్దికి సంబంధించిన సేల్స్ ఫోర్స్, సాట్ శిక్షణల గురించి, అమెరికా భారతి ఆటా 2023 మొదటి త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 1న విడుదల చేసామని, ద్వితీయ త్రైమాసిక పత్రిక కవర్ పేజి కోసం యువతకి ‘ఆర్ట్ పోటీ’ నిర్వహిస్తున్నా ము అని తెలియజేశారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు గత సంవత్సరం ఆటా సంబరాలకు పెద్ద మొత్తంలో దాతగా నిలబడి, మెడిటేషన్ గురించి అమెరికా వాసులకి అంతర్జాలంలో శిక్షణను కలిగించినందుకు అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా దాతలుగా నిలిచిన ఆటా పూర్వధ్యక్షులకు, పాలకమండలి సభ్యు లకు ధన్యవాదాలు తెలిపారు.
ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అమెరికాలోనే కాకుండా టర్కీ భూకంపం సందర్భంగా ధన సహాయం, రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయం, అలాగే తెలంగాణ గ్రామీణ మహిళల కోసం 'ఎనీమియా అవేర్నెస్’ ప్రోగ్రాం ద్వారా విటమిన్స్ అందచేయడానికి తగిన నిధులు జమ చేసి పంపడం జరుగుతుందన్నారు. నిరంతరంగా సేవా సహాయ, కార్యక్రమాలలో సంస్థ కార్యవర్గం ముందంజలో ఉంటుందని పేర్కొ న్నా రు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఆటాలో అత్యధికంగా కొత్త సభ్యులని చేర్చిన వారికి ‘మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఆఫ్ ది మంత్’ గా గుర్తింపునిచ్చారు. దీనిలో భాగంగా మార్చి మాసం రాలీ నుండి శృతి చామల గడ్దం, ఏప్రిల్ మాసం సాండియేగో నుండి కాశప్ప మదారంకు, అలాగే ఫస్ట్ క్వార్టర్‌లో మంచి కార్యక్రమాలను పెద్ద మొత్తంలో చేస్తున్న జాబితాలో ‘మోస్ట్ వాల్యుబుల్ సిటీ ఆఫ్ ది మంత్’ గా ఫీనిక్స్ నగరాన్ని గుర్తించి సంస్థ అభినందించింది. సమావేశంలో తెలియపరుస్తూ, అధిక సంఖ్యలో సంస్థలో సభ్యులను చేర్చడానికి, వినూత్నంగా భాష, సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను, మరెన్నో సహాయ కార్యక్రమాలను చేయాలని కార్యవర్గ బృందాన్ని ప్రోత్సహించారు. అట్లాంటాలో ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18వ కన్వెన్షన్ & యూత్ కాన్ ఫరెన్స్ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో జరపడానికి పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. అమెరికా తెలంగాణ సంఘం అమెరికా తెలుగు సంఘంలో ఐక్య మవ్వాలనే ప్రతిపాదనని పాలకమండలి సభ్యులు ఆమోదించారు. కలిసి పని చేసే ప్రాతిపదికపై కమిటీని నిర్ణయించారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆటా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-05-09T08:08:16+05:30 IST