ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaguar Kumar: ఉక్రెయిన్‌ యుద్ధంలో తెలు‘గోడు’.. సర్వం కోల్పోయిన ఏపీవాసి

ABN, First Publish Date - 2023-02-24T07:28:24+05:30

వేలాదిమంది ప్రాణాలు బలిగొని.. రూ.కోట్ల ఆస్తుల విధ్వంసం జరిగిన ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఓ తెలుగోడు కూడా తీవ్రంగా నష్టపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలాదిమంది ప్రాణాలు బలిగొని.. రూ.కోట్ల ఆస్తుల విధ్వంసం జరిగిన ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఓ తెలుగోడు కూడా తీవ్రంగా నష్టపోయాడు. ఒకసారి కాదు రెండుసార్లు సర్వం కోల్పోయాడు. అతడిపేరు.. డాక్టర్‌ గిడి కుమార్‌ పాటిల్‌ (జాగ్వార్‌ కుమార్‌). ఆంధ్రప్రదేశ్‌లోని తణుకువాసి. ఎంబీబీఎస్‌ చదివేందుకు 2007లో ఉక్రెయిన్‌ వెళ్లిన డా.కుమార్‌.. లుహాన్స్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పట్టా అందుకున్నారు. ఓవైపు వైద్యం చేస్తూనే.. రెస్టారెంట్‌ నిర్వహణలో భాగమయ్యారు. వ్యవసాయం చేయించేవారు. మధ్యలో కొన్నాళ్లు జాబ్‌ కన్సల్టెన్సీ కూడా నడిపారు. ఆర్థికంగా బాగుందని అనుకుంటున్న సమయంలో 2014లో క్రిమియాను రష్యా విలీనం చేసుకుంది. నాడు కుమార్‌ సర్వం కోల్పోయి.. స్వాతవో గ్రామానికి వెళ్లారు. 2010లో అక్కడ 25 ఎకరాలను కొనుగోలు చేసి.. వ్యవసాయం చేయడంతో పాటు రెస్టారెంట్‌ నిర్వహించేవారు. 2017లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు.

చిన్నప్పటినుంచి జంతువుల పట్ల విపరీతమైన ప్రేమ చూపే డాక్టర్‌ కుమార్‌ 2020లో జాగ్వార్‌ (చిరుతల్లోని ఒక రకం) పిల్లను కొనుగోలు చేశారు. దానిపై యూ ట్యూబ్‌లో వీడియోలు చేస్తూ పాపులర్‌ అయ్యారు. దీనికి జత కోసం యుద్ధానికి కొద్దిగా ముందు ఆడ నల్ల జాగ్వార్‌ను తీసుకొచ్చారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌ సమయానికి యుద్ధం స్వాతవో ప్రాంతానికీ పాకడంతో మళ్లీ సర్వం కోల్పోయారు. నిరుడు ఏప్రిల్‌లో.. రష్యన్‌ సైనికులు ఆయన్ను ఉక్రెయిన్‌ అనుకూలుడిగా భావించి బాగా కొట్టారు. నాడు ఎలాగోలా బయటపడ్డా సెప్టెంబరులో మరోసారి అదుపులోకి తీసుకుని నాలుగున్నర రోజులు చీకటి గదిలో బంధించి హింసించారు. దీంతో ఆయన ప్రాణాలు అరచేత పట్టుకుని పోలండ్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దేశ రాజధాని వార్సాలో శరణార్థిగా ఉంటున్నారు. వార్సాలోని భారత ఎంబసీ నుంచి పాస్‌పోర్టు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను ప్రాణంగా ప్రేమించే మూగ జీవాలను తనతో పాటు భారత్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వాలు సాయం చేయాలని కోరుతున్నారు. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2023-02-24T10:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising