ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

US: ఎన్నారై స్టోర్‌లో దొంగ హల్‌చల్.. పక్కా ప్లాన్ ప్రకారం చోరీ.. తుపాకీతో బెదిరించి నగదుతో పరార్..

ABN, First Publish Date - 2023-10-10T11:17:38+05:30

: అగ్రరాజ్యం అమెరికాలోని ఓ ఎన్నారై స్టోర్‌లో చోరీ జరిగింది. భారతీయ వ్యక్తి నడుపుతున్న ఓ స్టోర్‌లో తుపాకీతో చొరబడిన ఓ దొంగ.. అక్కడ పనిచేసే క్లర్క్‌ను బెదిరించి నగదుతో పరారయ్యాడు.

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలోని ఓ ఎన్నారై స్టోర్‌లో చోరీ జరిగింది. భారతీయ వ్యక్తి నడుపుతున్న ఓ స్టోర్‌లో తుపాకీతో చొరబడిన ఓ దొంగ.. అక్కడ పనిచేసే క్లర్క్‌ను బెదిరించి నగదుతో పరారయ్యాడు. వర్జీనియాలో (Virginia) ఆదివారం ఈ ఘటన జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు దోపిడీకి పాల్పడిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియా రాష్ట్రం వుడ్స్ ఎడ్జ్ రోడ్‌లోని శ్యామల్ పటేల్ (Shyamal Patel) అనే భారత సంతతి వ్యక్తి నడుపుతున్న స్మోకీ లాంజ్ స్మోక్ షాపులో (Smokies Lounge Smoke Shop) ఈ దొంగతనం జరిగింది.

యూఎస్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు స్టోర్‌లోకి ప్రవేశించిన దుండగుడు గుమాస్తాపై తుపాకీ ఎక్కుపెట్టి గల్లపెట్టెలో ఉన్న నగదు తీసి ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. దాంతో చేసేదేమిలేక స్టోర్ కీపర్ అతనికి నగదు తీసి ఇచ్చేశాడు. ఆ తర్వాత దొంగ ఆ నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ దోపిడీపై దుకాణం యజమాని శ్యామల్ పటేల్ చెస్టర్‌ఫీల్డ్ కౌంటీ పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. డబ్బుతో పారిపోయిన దొంగ కోసం గాలిస్తున్నారు.

ఈ దోపిడి ఘటనపై శ్యామల్ పటేల్ మీడియాతో మాట్లాడాడు. తన స్టోర్‌లో దోపిడీ జరగడం ఇదే తొలిసారి కాదన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇద్దరు సాయుధులైన దుండగులు ఇలాగే భారీ మొత్తం నగదును దోచుకెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తీవ్రంగా గాలించి ఒకరిని అరెస్ట్ చేశారని తెలిపాడు. ఇక తాజాగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రెండేళ్ల క్రితం తనతో కలిసి పనిచేసిన మాజీ ఉద్యోగి కావొచ్చని శ్యామల్ పటేల్ అనుమానం వ్యక్తం చేశాడు. ఇదిలాఉంటే.. వరుస దొంగతనాల నేపథ్యంలో శ్యామల్ పటేల్ తన దుకాణంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నాడు. స్టోర్ మొత్తం కవర్ అయ్యేలా అదనంగా 12 సీసీటీవీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేశాడు. రాత్రి 8 గంటల తర్వాత ఏడీటీ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తామన్నాడు. ఎంట్రీ గేటు వద్ద ఎవరైనా డోర్ బెల్ (Door Bell) నొక్కితే గుమాస్తా లోపలి నుంచి తలుపు ఓపెన్ చేస్తారన్నాడు.

UAE: గోల్డెన్ వీసాతో కలిగే ఎనిమిది అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..


Updated Date - 2023-10-10T11:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising