NRI: దుబాయిలో ఆర్యవైశ్యుల వనభోజనాలు
ABN, First Publish Date - 2023-12-13T14:03:34+05:30
ఎడారి దేశాలలోని తెలుగు సమాజమంతా కూడా కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అంటూ వనభోజనాలతో సందడి చేసింది. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్కులలోని ఆకుపచ్చ పొదల మధ్య ప్రకృతిలో మమేకమై ఆనందభరితంగా గడిపారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలోని తెలుగు సమాజమంతా కూడా కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అంటూ వనభోజనాలతో సందడి చేసింది. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్కులలోని ఆకుపచ్చ పొదల మధ్య ప్రకృతిలో మమేకమై ఆనందభరితంగా గడిపారు. సహాజంగా సంస్కృతి, సంప్రదాయాలు, అధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్యవైశ్యులు ఎక్కడయితే ఏమి తమ ఆచార వ్యవహారాలను నిక్కచ్చిగా పాటిస్తారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని దుబాయి, షార్జా, ఆబుధాబి, ఇతర ఏమిరేట్లలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఇటీవల కార్తీక మాసం చివరి ఆదివారంలో దుబాయిలో వనభోజన కార్యక్రమాన్ని తెలుగు ప్రవాసీ ప్రముఖులు బలుసా వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించగా అందులో కుల, మతాలకు తావు లేకుండా ఇతరులు కూడా పాల్గోన్నారు.
పూజలు, భోజనాలకు పరిమితం కాకుండా పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే వివిధ క్రీడలు, పాటల పోటీల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అందరూ ఆనందోత్సహాల మధ్య మైమరిచిపోయారు. సభికుల స్పందన, ప్రాంగణ పరిస్ధితుల ఆధారంగా తమ వాక్చతుర్యంతో స్రవంతి, శరణ్యలు చేసిన వ్యాఖ్యలు అందర్ని అలరించాయి.
వురా కృష్ణా, పల్తీ శ్రీనివాస్, చైతన్య చక్కినాల, సుంకు సాయి ప్రకాశ్, బవిరిశెట్టి శ్రీనాథ్, విశ్వాస్ గంగవరం, శ్రుజన్ శెట్టి, ఆషిక్ గుణపాటి, వంశీ కృష్ణ నిచ్చెనమట్ల, వెంకట పవన్ కప్పల, సత్యప్రవీణ్ కొమ్మూరి, బుచ్చు మురళీమోహన్, మహాలక్ష్మి కొమ్మూరి, ఇంద్రజ సురే, సంతోషి నాంపల్లి, శ్రవణ్ కుమార్ నాంపల్లి, శ్రీధర్ శ్రీచరణ్ పలుకూరు, అభిషేక్ ప్రసన్న కుమార్, లత పల్తీలు, సురేశ్ ఒబ్బిలిశెట్టి, వంగవీటి శ్రీనివాస రావు తదితరులు కార్యక్రమ నిర్వహణకు సమన్వయం చేశారు.
మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-13T14:03:37+05:30 IST