ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుక

ABN, First Publish Date - 2023-05-03T11:19:27+05:30

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో అక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత జయంతిని ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో అక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత జయంతిని ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. స్థానిక చైనా టౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. వాసవి జయంతితో పాటు వీసీఎంఎస్ (VCMS) దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సమయంలో జరుపుకోవటం కేవలం యాదృచ్ఛికమే కాక, ఇక్కడి ఆర్యవైశ్యులకు అత్యంత మోదాన్ని పంచే విశేషం కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిది గంటల పాటు నిర్విఘ్నంగా ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సుమారు 350 మందికి పైగా ఆర్యవైశ్యులు పాల్గొని తమ శ్రద్ధ, భక్తి ప్రపత్తులను చాటి చెప్పారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని తృప్తిగా తెలుగు సంప్రదాయ భోజన, తీర్థ, ప్రసాదాలను సేవించి తరించారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన అనేక మంది ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. వీసీఎంఎస్ కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ, అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీసీఎంఎస్, ఈ పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం కృషి ఉన్నాయని అన్నారు.

సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. అంతేగాక పలువురు యువ కళాకారులు భరతనాట్యం, కూచిపూడి మొదలైన సాంప్రదాయ నృత్య కళారీతులలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరికొందరు తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా కొలువైన వీసీఎంఎస్ నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించి ప్రెసిడెంట్‌గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గందె, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు పరిచయం చేశారు.

ఆ తరువాత సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టిని ‘వాసవి సేవా కుసుమ’గా అభినందిస్తూ చిరు సత్కారంతో పాటు జ్ఞాపికను కార్యనిర్వాహక బృందం ప్రదానం చేసింది. దూర తీరమైన సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా వీసీఎంఎస్ వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యకలాపాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్‌లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఫణేష్ ఆత్మూరి, సహ వ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి తమ తెలుగునుడితో వ్యవహరించటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Updated Date - 2023-05-03T11:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising