Canada: హిందూ దేవాలయాలే వారి టార్గెట్.. రెండు నెలల వ్యవధిలోనే 6 ఆలయాలలో లూటీ.. అసలు అంటారియోలో ఏం జరుగుతోంది..!
ABN, First Publish Date - 2023-10-13T14:24:33+05:30
కెనడాలోని అంటారియో ప్రావిన్స్ (Ontario province) లో దొంగలు హిందూ దేవాలయాలనే (Hindu Temples) టార్గెట్‌గా చేసుకుని వరుస లూటీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ నెలలో మూడు దొంగతనాలు జరిగాయని తెలియజేస్తూ డర్హామ్ పోలీసులు బుధవారం ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు.
అంటారియో ప్రావిన్స్: కెనడాలోని అంటారియో ప్రావిన్స్ (Ontario province) లో దొంగలు హిందూ దేవాలయాలనే (Hindu Temples) టార్గెట్‌గా చేసుకుని వరుస లూటీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ నెలలో మూడు దొంగతనాలు జరిగాయని తెలియజేస్తూ డర్హామ్ పోలీసులు బుధవారం ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు. అయితే, సెప్టెంబర్‌లో మరో మూడు ఆలయాలు ధ్వంసమైనట్లు తాజాగా బయటపడింది. ఇలా రెండు నెలల వ్యవధిలో అంటారియోలోనే (Ontario) మొత్తంగా 6 దొంగతనాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అక్టోబర్ 8వ తారీఖున ఉదయం పికరింగ్‌లోని దేవి మందిర్ (Devi Mandir), అజాక్స్‌లోని సంకట్ మోచన్ మందిర్ (Sankat Mochan Mandir), ఓషావాలోని హిందూ మందిర్ దుర్హమ్ (Hindu Mandir Durham) అనే మూడు ఆలయాల వద్ద వరుసగా చోరీలు జరిగినట్లు తెలిసింది.
పికరింగ్‌లోని దేవి మందిర్‌లో చోరీ జరగలేదు.ఎందుకంటే ఆవరణలో నివసించే పూజారి గిరీష్ ఖలీ ఫైర్ అలారంను లాగారు, ఇది అనుమానితుడిని భయపెట్టింది. దోపిడీకి గురైన ఇతర మూడు దేవాలయాలు గ్రేటర్ టొరంటో ఏరియా(GTA)లో ఉన్నాయి.సెప్టెంబర్ 9న బ్రాంప్టన్‌లోని మా చింతపూర్ణి ఆలయం (Maa Chintpurni Shrijidham), సెప్టెంబర్ 18న కాలెడాన్‌లోని రామేశ్వర మందిరం (Rameshwara Mandir) , అక్టోబర్ 4న మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్ (Hindu Heritage Centre) లో చోరీలు జరిగాయి. సెప్టెంబరు నుండి అంటారియోలోని హిందూ దేవాలయాలలో కనీసం ఆరు బ్రేక్-ఇన్లు జరిగాయి. పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, తమ సందర్శకులు, భక్తుల భద్రత, శ్రేయస్సును తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని రామేశ్వర మందిరం నిర్వాహకులు ప్రకటించారు.
ఇదిలాఉంటే.. హిందూ ఆలయాలే లక్ష్యంగా ఇలా వరుస లూటీలకు పాల్పడుతున్న అనుమానిత వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 5 అడుగుల 9 అంగుళాల పొడవు, 200 పౌండ్ల బరువున్న నిందితుడి కోసం పోలీసులు స్థానికంగా జల్లెడ పడుతున్నారు. ఇక దొంగతనాలకు పాల్పడుతున్న సమయంలో అతడు ఆకుపచ్చ రంగు క్యామో కార్గో ప్యాంటు, గట్టిగా జిప్ చేసిన హుడ్‌తో నల్లని జాకెట్, బ్లూ సర్జికల్ మాస్క్, ఆకుపచ్చ రంగు రన్నింగ్ షూలను ధరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిందూ హెరిటేజ్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage) లో సదరు దొంగ ఆనవాలను గుర్తించారు. చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని రామేశ్వర మందిరం నిర్వాహకులు తెలియజేశారు.
Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!
Updated Date - 2023-10-13T14:24:33+05:30 IST