ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BATA: బే ఏరియాలో ఘనంగా 'బాటా' దీపావళి సంబరాలు!

ABN, First Publish Date - 2023-11-10T13:10:44+05:30

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌‌లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాటా ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లలో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందాయి.

BATA: కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌‌లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాటా ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లలో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఈవెంట్‌కు స్థానిక సంఘాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 11:00 గంటల వరకు జరిగింది. టాలీవుడ్ ప్రముఖ గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌ల లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ ఈవెంట్‌కు సంజయ్ ట్యాక్స్ ప్రో" అసోసియేట్ స్పాన్సర్ కాగా, రియల్టర్ నాగరాజ్ కూడా స్పాన్సర్ చేశారు. గ్రాండ్ స్పాన్సర్‌గా ఏవీఆర్ చౌదరి (G&C గ్లోబల్), గోల్డ్ స్పాన్సర్‌గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్‌లుగా PNG జ్యువెలర్స్, TESQA.AI & VYZN రియల్టీ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి 'పాఠశాల' (పాఠశాల తెలుగు స్కూల్) & విరిజల్లు రేడియో మద్దతునిచ్చాయి.

ఈ ఈవెంట్‌కు ఫుడ్ స్పాన్సర్స్‌గా ‘శ్రీ కిచెన్’ ఆహూతులకు పసందైన వంటకాలను అందించింది. ఇక ఈ ఈవెంట్‌లో దుస్తులు, నగలు, రియల్ ఎస్టేట్, విద్య & ఆరోగ్య సంరక్షణ విక్రేతల బూత్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్ ముఖ్యాంశాలు 'బాటా' సాంస్కృతిక బృంద సభ్యులు ఫ్రీమాంట్, శాన్ రామన్, డబ్లిన్, మిల్పిటాస్, కుపెర్టినో, శాన్ జోస్ వంటి పలు ప్రాంతాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు.150 మందికి పైగా పిల్లలు, యువతీయువకులు వివిధ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్‌లలో పాల్గొన్నారు. వారందరికీ బాటా బృందం కృతజ్ఞతలు తెలిపింది. టాలీవుడ్ ప్రముఖ గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్(ఊ అంటావా ఫేమ్) లతోపాటు అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

సూపర్ డూపర్ హిట్ పాటలను ఒకదాని తర్వాత ఒకటి మంగ్లీ పాడుతుంటే ఆహూతులంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు కష్టపడ్డ వాలంటీర్లకు బాటా అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. శివ కాడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన 'స్టీరింగ్ కమిటీ'ని కూడా పరిచయం చేశారు. 'సాంస్కృతిక కమిటీ'లో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి ఉన్నారు. 'లాజిస్టిక్స్ టీమ్'లో సందీప్ కేదారిసెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజు ఉన్నారు.

యూత్ కమిటీలో సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సందీప్, హరీష్ ఉన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బ్యాండ్ సభ్యులకు బాటా సలహా బోర్డు సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-11-10T13:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising