US President Joe Biden:అమెరికా పర్యటనకు రండి... ప్రధాని నరేంద్రమోదీకి జో బిడెన్ ఆహ్వానం
ABN, First Publish Date - 2023-02-01T10:54:27+05:30
ఈ ఏడాది అమెరికా పర్యటనకు రావాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్...
వాషింగ్టన్ : ఈ ఏడాది అమెరికా పర్యటనకు రావాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానించారు.(Biden invites PM Modi) జోబిడెన్ ఆహ్వానాన్ని(Invitation) ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం సూత్రప్రాయంగా అంగీకరించింది. జి 20 దేశాల అధ్యక్షుడిగా మోదీ అధ్యక్షతన సెప్టెంబరులో జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి జో బిడెన్(US President Joe Biden)హాజరు కానున్నారు.యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్ లు జూన్, జులై నెలల్లో జరగనున్నాయి. దీంతో మోదీ(Prime Minister Modi) అమెరికా పర్యటన తేదీల కోసం భారత్, అమెరికా దేశాల అధికారులు ఎదురుచూస్తున్నారు.
మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తారని, అనంతరం వైట్ హౌస్‌లో జరగనున్న విందులో కూడా పాల్గొంటారని సమాచారం. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లడం ఇది రెండోసారి. సెప్టెంబరు 2021లో ప్రధానమంత్రి వాషింగ్టన్ లో పర్యటించారు. ఆ సమయంలో మోదీ బిడెన్‌తో తన తొలి ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.
గత ఏడాది నవంబర్ నెలలో బాలిలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ను కలిశారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు భారతదేశం-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రపంచ పరిణామాలపై సమీక్షించారు.
Updated Date - 2023-02-01T10:55:44+05:30 IST