ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deportation: 'బాంబు' ఉందంటూ జోక్.. ప్రవాసుడిని దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్!

ABN, First Publish Date - 2023-08-17T08:42:47+05:30

విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులతో ప్రవాసుడు (Expatriate) చేసిన జోక్ కాస్తా రివర్స్ అయింది. దాంతో ఆ ప్రవాసుడికి ఏకంగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కువైత్ సిటీ: విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులతో ప్రవాసుడు (Expatriate) చేసిన జోక్ కాస్తా రివర్స్ అయింది. దాంతో ఆ ప్రవాసుడికి ఏకంగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన లగేజీలో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బందితో మనోడు జోక్ చేశాడు. అదే అతడి కొంపముంచింది. గత వారం ఈ ఘటన కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait International Airport) లో జరిగింది. ఓ అరబ్ ప్రవాసుడు స్వదేశానికి వెళ్లేందుకు కువైత్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో విమానాశ్రయంలోకి ప్రవేశించిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ప్రవాసుడి లగేజీని తనిఖీ చేస్తున్న సమయంలో తన బ్యాగేజీలో 'బాంబ్' ఉందని జాగ్రత్తగా చెక్ చేయాలంటూ అధికారులతో పరాచకాలు ఆడాడు.

అంతే.. సెక్యూరిటీ సిబ్బంది సదరు ప్రవాసుడిని లగేజీతో సహా జలీబ్ పోలీస్ స్టేషన్‌ (Jaleeb Police Station) కు తరలించింది. అక్కడ అతడి లగేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను జోక్ (Joke) చేశానని, ఇంత సీరియస్ అవుతుందని ఊహించలేదంటూ పోలీసుల ముందు వాపోయాడు. ఇలాంటి విషయంలో జోక్ ఏంటంటూ ప్రవాసుడిపై మండిపడ్డారు. అంతేగాక వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఇలాంటి విషయాలలో జోక్ చేయకూడదని విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు ఈ సంఘటనను ఉదహరిస్తూ ప్రయాణికులను హెచ్చరించారు. లేనిపక్షంలో దేశ బహిష్కరణ తప్పదని వార్న్ చేశారు.

Kuwait: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారీగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కువైత్..!


Updated Date - 2023-08-17T08:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising