ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India-UAE flights: మరో భారత నగరం నుంచి దుబాయ్‌కి డైరెక్ట్ విమానం.. పైగా వీక్లీ మూడు సర్వీసులు కూడా..

ABN, First Publish Date - 2023-05-16T08:27:22+05:30

దుబాయ్‌కి భారత్ నుంచి భారీ మొత్తంలో ప్రయాణీకులు డైలీ రాకపోకలు కొనసాగిస్తుంటారనే విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: దుబాయ్‌కి భారత్ నుంచి భారీ మొత్తంలో ప్రయాణీకులు డైలీ రాకపోకలు కొనసాగిస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇండియాలోని పలు ప్రధాన నగరాల నుంచి దుబాయ్‌కి డైరెక్ట్ విమాన సర్వీసులు (Direct Fligt Services to Dubai) నడుస్తున్నాయి. తాజాగా ఈ నగరాల జాబితాలోకి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) చేరింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (Biju Patnaik International Airport) నుంచి దుబాయ్‌కి తొలి విమాన సర్వీసును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. బడ్జెట్ క్యారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ ( IndiGo Airlines) ఈ విమాన సర్వీసును నడిపింది. వారానికి మూడు సర్వీసులు ఉంటాయి.

సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసులు నడుస్తాయి. ఈ మూడు రోజుల్లో దుబాయ్ (Dubai) నుంచి విమానం ఉదయం 11.25 గంటలకు బయల్దేరి, భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరే విమాన సర్వీస్ రాత్రి 9.45 గంటలకు దుబాయ్ చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం ప్రారంభమైన తొలి విమాన సర్వీసు 170 మంది ప్రయాణీకులతో భువనేశ్వర్ నుంచి దుబాయ్ వెళ్లింది. ఈ సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ (Chief Minister Naveen Patnaik) మాట్లాడుతూ, ఒడిశాను దుబాయ్ వంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం వల్ల పెట్టుబడులకు సులభతరం అవుతుందన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఒడియా ప్రవాసులతో అనుబంధం కూడా పెరుగుతుందని తెలిపారు.

Kuwait: కువైత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. వందల మంది ప్రవాసులు అరెస్ట్!


Updated Date - 2023-05-16T08:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising