ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China Visas to Indians: ఈ ఏడాది మొదటి 6నెలల్లోనే 71వేలకు పైగా వీసాలు మంజూరు చేసిన డ్రాగన్ కంట్రీ..!

ABN, First Publish Date - 2023-07-13T08:05:16+05:30

డ్రాగన్ కంట్రీ చైనా ఈ ఏడాది భారతీయ పౌరులకు (Indian Citizens) భారీ మొత్తంలో వీసాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: డ్రాగన్ కంట్రీ చైనా ఈ ఏడాది భారతీయ పౌరులకు (Indian Citizens) భారీ మొత్తంలో వీసాలు జారీ చేసింది. 2023 మొదటి అర్ధ భాగంలోనే ఏకంగా 71,600 వీసాలు మంజూరు చేయడం విశేషం. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ (Wang Xiaojian) ట్వీట్ చేశారు. బిజినెస్, పర్యాటకం, అధ్యాయనం, ఇతర పనుల నిమిత్తం భారతీయులకు (Indians) ఇలా అధిక సంఖ్యలో వీసాలు (Visas) జారీ చేసినట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే చైనీయులపై విధించిన వీసా పరిమితులను ఇండియా త్వరగా ఎత్తివేయాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పున:ప్రారంభించాలని ఎదురుచూస్తున్నట్ల వాంగ్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే చైనీస్ ఎంబసీ, కాన్సులేట్ జనరల్ భారతీయులకు 60వేల వీసాలు జారీ చేసినట్లు వాంగ్ ట్వీట్ చేశారు. వీటిలో టూరిజం, బిజినెస్, స్టడీ, వర్క్, ఫ్యామిలీ రీయూనియన్ వంటి వివిధ రకాల పనుల కోసం భారతీయ పౌరులను చైనాలోకి ఆహ్వానించేందుకు వీసాలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఇక ఈ ఏడాది మార్చిలోనే భారత్ సహా విదేశీ సందర్శకులను (Foreign Tourists) దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక 2020 మార్చి 28 కంటే ముందు జారీ చేసిన చైనీస్ వీసాలు (Chinese Visas) చెల్లుబాటు అయ్యేలా వాటి గడువును తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని కూడా చైనా రాయబార కార్యాలయం ఆ సమయంలో ప్రకటించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఇండియాలోని చైనీస్ ఎంబసీ, కాన్సులేట్ జనరల్ వివిధ రకాల వీసాల జారీని ప్రారంభించింది. చైనీస్ వీసా దరఖాస్తుతో పాటు ఇతర వివరాల కోసం చైనీస్ రాయబారకార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న అప్‌డేటేడ్ నోటీస్‌ను చూడాలని కోరింది.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-13T08:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising