ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Tourists: దుబాయి పర్యటనను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకుంటున్న భారత టూరిస్టులు.. కారణమిదే..

ABN, First Publish Date - 2023-07-23T11:50:39+05:30

దుబాయి (Dubai) లో సెలవులను ఆస్వాదించాలని ఎదురుచూసిన చాలా మంది భారత పర్యాటకులు (Indian Tourists) తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) తెలిపాయి.

ఎన్నారై డెస్క్: దుబాయి (Dubai) లో సెలవులను ఆస్వాదించాలని ఎదురుచూసిన చాలా మంది భారత పర్యాటకులు (Indian Tourists) తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) తెలిపాయి. దీనికి కారణం.. వారి స్వస్థలాలల్లో భారీ వర్షాలు కురిసి వరదలు బీభత్సం సృష్టించడమేనని పేర్కొన్నాయి. గడిచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలను కుండపోత వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. వరదనీరు నివాసాల్లోకి రావడం, రహదారులు సైతం కొట్టుకుపోవడం కొన్ని రాష్ట్రాల్లో సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పర్యటనలు (Foreign Tours) ఏంటని చాలామంది భారతీయ పర్యాటకులు తమ దుబాయి టూర్లను రద్దు చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు (Travel Agents) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారవేత్త తాలూకు ఘటనను ట్రావెల్ ఏజెన్సీలు ఉదాహరణగా పేర్కొనడం జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన బిజినెస్‌మెన్ (Businessman) అలోక్ కుమార్ తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి జూలై 18న దుబాయి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం అతడు ట్రావెల్ ఏజెంట్ ద్వారా విమాన టికెట్లు, వసతిని బుక్ చేసుకున్నారు. కానీ, భారీ వర్షాల కారణంగా అన్ని ప్లాన్స్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. "నా మిత్రులు, వారి కుటుంబాలు కాన్పూర్, భోపాల్, సూరత్ నుంచి ఢిల్లీకి చేసుకోవాల్సి వచ్చింది. వరదల కారణంగా రైళ్లు, బస్సు సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు నెలకొన్నాయి. కావున మేము మా ప్లాన్స్‌తో ముందుకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఇక నా కూతురు, భార్య ఈ నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. కానీ, పరిస్థితులు చక్కబడిన తర్వాత తప్పకుండా దుబాయి వెళ్దామని వారిని శాంతింపజేశాను" అని అలోక్ కుమార్ చెప్పుకొచ్చారు. అలాగే నదీమ్ సైఫీ అనే మరో వ్యక్తి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయి పర్యటనకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ, వర్షాల కారణంగా అన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా పలురువు భారతీయ టూరిస్టులు వర్షాల నేపథ్యంలో దుబాయి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.

Tech Tips: విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా? ఈ భారతీయ సర్వీస్ అందుబాటులో ఉన్న దేశాలు ఏవంటే..!


Updated Date - 2023-07-23T11:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising