Dubai: భారతీయ జంట హత్య కేసు.. ఉరిశిక్ష పడిన పాకిస్తానీ అప్పీల్‌ను తోసిపుచ్చిన దుబాయి కోర్టు!
ABN, First Publish Date - 2023-07-06T09:46:06+05:30
భారతీయ జంట (Indian couple) హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న పాకిస్తానీ (Pakistani) అప్పీల్‌ను తాజాగా దుబాయి అత్యున్న న్యాయస్థానం (Dubai's highest court) తోసిపుచ్చింది.
ఎన్నారై డెస్క్: భారతీయ జంట (Indian couple) హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న పాకిస్తానీ (Pakistani) అప్పీల్‌ను తాజాగా దుబాయి అత్యున్న న్యాయస్థానం (Dubai's highest court) తోసిపుచ్చింది. దీంతో పాక్ వ్యక్తికి మరణశిక్ష ఖాయం అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2020లో గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త హిరేన్ అధియా (Hiren Adhia), అతని భార్య విధి అధియా (Vidhi Adhia) ని 28 ఏళ్ల పాక్ జాతీయుడు వారు నివాసం ఉండే అరేబియా రాంచెస్‌లోని మిరాడోర్‌లో అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన అనంతరం నిందితుడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు (Dubai Criminal Court) గతేడాది ఏప్రిల్‌లో ఉరిశిక్ష విధించింది.
కాగా, హిరేన్ దంపతులను తాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అందువల్ల ఉరిశిక్షను ఎత్తివేయాలని నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌లను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గతేడాది నవంబర్‌లో తిరస్కరించింది. ఇక ఎమిరేట్స్ అత్యున్నత న్యాయస్థానమైన దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ (Dubai Court of Cassation), క్రిమినల్ ప్రొసీజర్స్ చట్టం ప్రకారం.. దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ (Sheikh Mohammed bin Rashid) ఆమోదముద్ర వేసిన తర్వాతే ఉరిశిక్షను అమలు చేస్తారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడి అప్పీల్‌ను దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ రెండూ తిరస్కరించాయి.
NRIs: అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎన్నారైల భారీ విరాళాలు.. ఎవరెంత ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
Updated Date - 2023-07-06T09:46:06+05:30 IST