No passport, no visa: మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకు వచ్చిన దుబాయ్.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే..
ABN, First Publish Date - 2023-10-19T10:06:47+05:30
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ (Passport), వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది.
ఎన్నారై డెస్క్: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ (Passport), వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది. దీనికి కారణం స్మార్ట్ టెక్నాలజీ (Smart Technology). ఇప్పటికే దుబాయ్ ఫ్లైయింగ్ ట్యాక్సీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ కోసం స్మార్ట్ గేట్స్ (Smart Gates) ఇలా పలు వినూత్న ఆలోచనతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరో అద్భుత స్మార్ట్ ఆలోచనతో ముందుకు వస్తోంది. భవిష్యత్‌లో దుబాయ్ నివాసితులు, సందర్శకులు ఎలాంటి పాస్‌పోర్ట్, వీసా, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్స్ (Travel Documents) లేకుండానే ప్రయాణించే దిశగా అడుగులేస్తోంది. దీనికోసం ఓ ప్రత్యేకమైన స్మార్ట్ టెక్నాలజీ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎమారాటెక్ (Emaratech) అనే టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA)తో కంపెనీ కలిసి పని చేస్తోంది.
e-visa: మరో ఆరు దేశాలకు 'ఇ-వీసా' యాక్సెస్‌ను విస్తరించిన సౌదీ అరేబియా
ఈ సందర్భంగా ఎమారాటెక్ మేనేజర్ అహ్మద్ బహా మాట్లాడుతూ.. "ఒక ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, వారు మాకు ఎలాంటి ట్రావెల్ పత్రాలు చూపించకుండానే మేము వారి తాలూకు డేటాను వారి ముందు ఉంచుతాము. వారి ఫ్లైట్, వీసా వివరాలు మా సిస్టమ్‌లో ఉంటాయి" అని అన్నారు. ఇలా ప్రయాణికుల స్మార్ట్ చెకింగ్ అనేది చెక్-ఇన్ కౌంటర్ వద్ద నుంచే ప్రారంభం అవుతుందన్నారు. అక్కడ ప్రయాణికుల ఫొటోలు క్యాప్చర్ చేయబడి, వారి ముఖ లక్షణాలను స్కాన్ చేసే స్ట్రీమ్‌లైన్డ్ ప్రక్రియ ఉంటుంది. తద్వారా వారి సమగ్ర ప్రయాణ సమాచారం అందించబడుతుందని పేర్కొన్నారు.
NRI: అమెరికాలో కలకలం.. 'ఇదే లాస్ట్ వార్నింగ్ .. చచ్చిపోతారు' అంటూ సిక్కు మేయర్ ఫ్యామిలీకి బెదిరింపులు
ఇక చెక్-ఇన్ కౌంటర్ వద్ద తీసుకున్న ప్రయాణీకుల ఫొటోలు వారి జర్నీ అంతటా ఉపయోగించడం జరుగుతుందని అహ్మద్ చెప్పారు. ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్న వెంటనే వారు కౌంటర్‌కు వెళ్లే బదులు నేరుగా స్మార్ట్ గేట్‌కు వెళ్లగలుగుతారు. మళ్లీ స్మార్ట్ గేట్ వద్ద వారు ఎటువంటి ప్రయాణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి ఫొటో, ఫేస్ ఐడీ అనేది అన్ని రుజువులను చూపిస్తుందని అహ్మద్ బహా వివరించారు. ఇలా స్మార్ట్ టెక్నాలజీ సహాయంతో నివాసితులు, సందర్శకులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే దుబాయ్ నగరాన్ని సందర్శించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే దీన్ని వినియోగంలోకి తెస్తామని చెప్పుకొచ్చారు.
NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు
Updated Date - 2023-10-19T10:06:47+05:30 IST