Dubai: 'దుబాయి సమ్మర్ సర్‌ప్రైజెస్' వచ్చేసిందోచ్..!
ABN, First Publish Date - 2023-06-08T10:30:24+05:30
ఈద్ అల్- అదా (Eid Al-Adha) సెలవుల సందర్భంగా ఈవెంట్ రిటర్న్‌గా రాఫెల్స్, షాపింగ్ డీల్స్, ప్రమోషన్స్ వచ్చేశాయి.
దుబాయి: ఈద్ అల్- అదా (Eid Al-Adha) సెలవుల సందర్భంగా ఈవెంట్ రిటర్న్‌గా రాఫెల్స్, షాపింగ్ డీల్స్, ప్రమోషన్స్ వచ్చేశాయి. లాటరీలు, రిటైల్ ప్రమోషన్స్, ఈవెంట్ల స్పెషల్ 'దుబాయి సమ్మర్ సర్‌ప్రైజెస్' (Dubai Summer Surprises) తిరిగి వచ్చింది. ఈ ఈవెంట్ 26వ ఎడిషన్ ఈద్ అల్ అధా గుర్తుగా ప్రారంభమవుతుంది. ఇక ఈసారి ఈద్‌కు నివాసితులు, పౌరులకు ఆరు రోజుల లాంగ్ వీకెండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు తాజాగా డీఎస్ఎస్ (DSS) తేదీలను ప్రకటించారు. జూన్ 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు నివాసితులకు డీఎస్ఎస్ అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి క్యాలెండర్‌ను జూన్ 20న ప్రకటించనున్నట్టు దుబాయి ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (Dubai Festivals and Retail Establishment) ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలాఉంటే.. ఈసారి ప్రమోషన్‌లలో వివిధ రకాల హోటళ్లలో స్పెషల్ ఆఫర్స్, నగరంలోని అన్ని మాల్స్, ప్రముఖ గమ్యస్థానాలలో ఎర్లీ బర్డ్ ఆఫర్స్ (Early bird offers) అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. డీఎస్ఎస్ ప్రారంభ వేడుకలో జూలై 1న కోకాలకోలా ఎరీనాలో నిర్వహించే కచేరీలో హుస్సేన్ అల్ జాస్మీ, కడిమ్ అల్ సాహిర్ పాల్గొంటారు. సౌదీ అరేబియా లెజెండ్ మహ్మద్ అబ్డో కూడా తర్వాతి రోజు సాయంత్రం జరిగే కోకాకోలా ఎరీనాలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇక ఈ ఏడాది డీఎస్ఎస్ సందర్భంగా అద్భుతమైన డీల్స్, ప్రమోషన్స్ అందుబాటులో ఉంటాయని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేకమైన షాపింగ్ డీల్స్.. రోజువారీ ఆశ్చర్యకరమై, ఉత్కంఠభరితమైన పోటీలు.. షాప్-అండ్-విన్ ప్రమోషన్‌లను మిస్ చేసుకోవద్దని తెలిపింది.
Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!
Updated Date - 2023-06-08T10:30:24+05:30 IST