Dubai rents: ప్రవాసులకు షాక్.. దుబాయ్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన అద్దెలు..
ABN, First Publish Date - 2023-02-09T12:31:00+05:30
దుబాయ్‌లో (Dubai) అద్దెలు ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో భారీగా పెరిగాయి.
దుబాయ్: దుబాయ్‌లో (Dubai) అద్దెలు ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 20శాతానికి పైగానే పెరిగినట్లు తెలుస్తోంది. జెబెల్ ఏరియాలో ట్రిపుల్ బెడ్ అపార్ట్‌మెంట్ వార్షిక అద్దె ఇంతకుముందు 70వేల దిర్హమ్స్ ఉండేది. ఇప్పుడు 84వేల దిర్హమ్స్‌కు చేరింది. ఇక దుబాయ్ హిల్స్ వంటి కమ్యూనిటీలో ఈ పెరుగుదల అనేది 20శాతంగా నమోదైంది. దుబాయ్ మెరీనాలో 31శాతం, జుమేరా లేక్ టవర్స్ 16శాతం పెరిగాయి. అటు అద్దె పెరుగుదల సగటున 10 నుంచి 15శాతంగా ఉందని సారా హెవర్డిన్ తెలిపారు.
అపార్ట్‌మెంట్స్ బాటలోనే అటు విల్లాల ధరలు భారీగా పెరిగాయి. 2021తో పోలిస్తే 37శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, కొత్త రెసిడెన్సీ, వీసా విధానాలు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ప్రధానంగా గోల్డెన్ వీసా పథకం (Golden Visa Scheme), కొత్త ఐదేళ్ల గ్రీన్ రెసిడెన్సీలతో (Green Residency) పాటు గతేడాది అమలులోకి వచ్చిన అనేక రెసిడెన్సీ సంస్కరణల కారణంగా దుబాయ్‌లో అద్దెలు ఇటీవల విపరీతంగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?
Updated Date - 2023-02-09T12:31:01+05:30 IST