ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: షాపింగ్ మాల్‌లో ఘర్షణ.. ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN, First Publish Date - 2023-08-30T10:36:26+05:30

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న పొరపాటు కూడా మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకపోలేదు.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న పొరపాటు కూడా మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలు తెలుసుకుని వెళ్లడం చాలా మంచిది. ఇక కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారులు ఏ చిన్న పొరపాటు చేసిన దేశం నుంచి బహిష్కరించడం (Deported) చేస్తోంది. ఇదే కోవలో తాజాగా ఆ దేశంలో జరిగిన ఓ సంఘటన, ఆ తర్వాత అంతర్గత మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాలు ప్రస్తుతం వార్తల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఖురైన్ (Qurain) ప్రాంతంలోని కమర్షియల్ మార్కెట్‌లో జరిగిన ఓ ఘర్షణ తాలూకు వీడియో సోషల్ మీడియా (Social Media) లో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఈజిప్టియన్లు షాపింగ్‌ మాల్‌లో తోటి కస్టమర్లు భయాందోళనకు గురయ్యేలా ఘర్షణ పడడం ఉంది. ఆ సమయంలో వారు చేతికి అందిన వస్తువులతో దాడికి పాల్పడ్డారు. ఆ దాడి తాలూకు వీడియో బయటకు రావడంతో అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) చర్యలకు ఉపక్రమించింది. ఆ గొడవలో పాల్గొన్న ఈజిప్ట్ ప్రవాసులందరినీ వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రిత్వశాఖ ఆదేశించింది.

Visa-free travel to UAE: 82 దేశాల వారికి యూఏఈ తీపి కబురు.. భారతీయులకు మాత్రం కండిషన్ అప్లై..!

Updated Date - 2023-08-30T10:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising