ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: నిన్న ట్రాఫిక్ ఫైన్.. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..?

ABN, First Publish Date - 2023-08-23T07:33:19+05:30

దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) మునుపెన్నడూ లేనివిధంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇటీవల ట్రాఫిక్ జరిమానాలు (Traffic Fines) చెల్లించకుండా దేశం విడిచివెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదని ప్రకటించిన కువైత్.. తాజాగా మరో కండిషన్‌ను తెరపైకి తెచ్చింది.

కువైత్ సిటీ: దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) మునుపెన్నడూ లేనివిధంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇటీవల ట్రాఫిక్ జరిమానాలు (Traffic Fines) చెల్లించకుండా దేశం విడిచివెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదని ప్రకటించిన కువైత్.. తాజాగా మరో కండిషన్‌ను తెరపైకి తెచ్చింది. అదేంటంటే.. ఎలక్ట్రిసిటీ బిల్ (Electricity Bill). గృహాలకు వినియోగించిన విద్యుత్ తాలూకు పెండింగ్ బిల్లు ఉంటే.. అవి క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలెట్టిందని సమాచారం. ఈ విషయమై సాధ్యాసాధ్యాలపై సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికే వచ్చే అవకాశం ఉందని తెలిసింది. దేశం విడిచిపెట్టి వెళ్లాలంటే ప్రవాసులు ట్రాఫిక్ చలాన్ల మాదిరిగానే ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను సైతం చెల్లించడం తప్పనిసరి చేయనుంది.

ఇదిలాఉంటే.. ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే 70 మంది ప్రవాసులపై చర్యలకు ఉపక్రమించింది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది. అంతేగాక వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో 66వేల కువైటీ దినార్లు (రూ. 1.77కోట్లు) వసూలు చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

దేశం విడిచి వెళ్లే ప్రవాసులందరూ ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violence) సమీక్షించుకోవాలని, ప్రయాణంలో జాప్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ ఉల్లంఘనల తాలూకు చలాన్లను ముందుగానే క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ సూచించింది. ట్రాఫిక్ ఫైన్స్ ఉన్న విదేశీయులు (Foreigners) మంత్రిత్వశాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (లేదా) ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో (లేదా) విమానాశ్రయంలోని ఆఫీస్‌లో (లేదా) బార్డర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో చెల్లించవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ప్రతి ప్రవాసుడు (Expat) చట్టానికి కట్టుబడి ఉండాలని, వాటిని ఉల్లంఘించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.

Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!


Updated Date - 2023-08-23T07:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising