ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Expatriates: కువైత్‌లో ప్రవాసుల అప్పు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ABN, First Publish Date - 2023-09-08T12:25:32+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కు ప్రవాసులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని తాజాగా ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.13,480కోట్లు అన్నమాట.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కు ప్రవాసులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని తాజాగా ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.13,480కోట్లు అన్నమాట. ఇక ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు వారి రుణాలను తప్పనిసరిగా చెల్లించాలని ఇటీవల ఆయా మంత్రిత్వశాఖలు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మొదటి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ ఆదేశాలతో ప్రవాసులు (Expats) ప్రయాణానికి ముందు జరిమానాలు క్లియర్ చేయడాన్ని మంత్రిత్వ శాఖలు తప్పనిసరి చేశాయి.

ప్రస్తుతం ట్రాఫిక్ విభాగం (Traffic Department), విద్యుత్, నీటి వనరుల మంత్రిత్వశాఖ, టెలీ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వశాఖతో సహా నాలుగు ప్రభుత్వ సంస్థలు ప్రవాసులు ఏ కారణంతోనైనా సరే దేశం విడిచి వెళ్లే ముందు వారి బకాయిలు వసూలు చేయడానికి ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఆరోగ్యశాఖ, కువైత్ మున్సిపాలిటీ (Kuwait Municipality), వాణిజ్య మంత్రిత్వశాఖతో పాటు ఇతర సంస్థలు ఈ జాబితాలో చేరతాయని నివేదిక పేర్కొంది. ఇదిలాఉంటే.. చాలా మంది ప్రవాసులు వివిధ మంత్రిత్వ శాఖలకు బకాయిలు చెల్లించకుండా శాశ్వతంగా దేశం విడిచి వెళ్లడంతో ఏడాదిలో 3 బిలియన్ దినార్లకు పైగా ఎగ్గొట్టారని నివేదిక తెలిపింది.

Kuwait: వరుస తనిఖీలతో ప్రవాసులను బెంబెలెత్తిస్తున్న గల్ఫ్ దేశం.. ఇకపై అలాంటి వారు కువైత్ నేలపై ఉండకూడదంటూ..


Updated Date - 2023-09-08T12:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising