ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!

ABN, First Publish Date - 2023-08-26T08:24:32+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) తాజాగా మరో కొత్త షరతు విధించింది. మొన్నటి వరకు బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు చెల్లించిన తర్వాతే దేశం దాటాలని చెప్పిన కువైత్.. ఇప్పుడు టెలిఫోన్ బిల్స్, లీగల్ డ్యూస్ కూడా కడితేగానీ దేశం నుంచి వెళ్లడానికి వీల్లేదని చెబుతోంది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) తాజాగా మరో కొత్త షరతు విధించింది. మొన్నటి వరకు బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు చెల్లించిన తర్వాతే దేశం దాటాలని చెప్పిన కువైత్.. ఇప్పుడు టెలిఫోన్ బిల్స్, లీగల్ డ్యూస్ కూడా కడితేగానీ దేశం నుంచి వెళ్లడానికి వీల్లేదని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ బుధవారం నాడు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ అల్-మజ్రెన్‌తో పాటు న్యాయ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హషీమ్ అల్-కల్లాఫ్‌తో రాష్ట్ర బకాయిలను వసూలు చేయడానికి మూడు మంత్రిత్వ శాఖలలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌ఫేస్ విధానంపై చర్చించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. బకాయిలు ఉన్న ప్రవాసులు ఎట్టిపరిస్థితుల్లో దేశం దాటి వెళ్లకుండా పకడ్బందీగా వ్యవహారించాలని ఈ సందర్భంగా ఆయా మంత్రిత్వశాఖలకు అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సూచించారు. త్వరలోనే దీనిపై పూర్తి విధి విధానాలు వెల్లడవుతాయని సమాచారం.

ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకునే ప్రవాసులు ట్రాఫిక్ చలాన్ల మాదిరిగానే ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను సైతం చెల్లించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కరెంట్ బిల్లు బకాలను మ్యూ-పే (mew-pay) లేదా సహేల్ (Sahel) యాప్‌ ద్వారా చెల్లించవచ్చని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (Ministry of Electricity, Water and Renewable Energy) పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీసులు లేదా కువైత్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-04లోని కస్టమర్ సర్వీస్ కేంద్రంలో కూడా బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ఇక ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించింది. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం విధిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే 70 మంది ప్రవాసులపై చర్యలకు ఉపక్రమించింది కువైత్. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది. అంతేగాక వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో 66వేల కువైటీ దినార్లు (రూ. 1.77కోట్లు) వసూలు చేసింది కూడా. సో.. కువైత్ నుంచి స్వదేశానికి పయనమయ్యే ముందు ప్రవాసులు ఈ వ్యవహారాలను చక్కబెట్టుకోవడం బెటర్. లేకపోతే ఎన్నో రోజుల ముందు ప్లాన్ చేసుకున్న ప్రయాణం చివరి నిమిషంలో తిప్పలు తప్పవు.

Trump Mug shot: మగ్‌షాట్‌ ఫొటోతో చరిత్రకెక్కిన ట్రంప్.. అదే ఫొటోతో తొలి ట్వీట్.. సోషల్ మీడియాలో రికార్డ్!


Updated Date - 2023-08-26T08:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising