Kuwait: ప్రవాసుల విషయమై కువైత్ కీలక ప్రకటన.. ఆ పని చేయకుండా దేశం దాటొద్దంటూ..
ABN, First Publish Date - 2023-08-19T12:33:39+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) తెలిపింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) తెలిపింది. శనివారం (ఆగస్టు 19వ తేదీ) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తన ప్రకటనలో పేర్కొంది. దేశం విడిచిపెట్టి వెళ్లే ముందు ట్రాఫిక్ ఫైన్స్ ఉన్న విదేశీయులు (Foreigners) మంత్రిత్వశాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (లేదా) ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో (లేదా) విమానాశ్రయంలోని ఆఫీస్‌లో (లేదా) బార్డర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో చెల్లించవచ్చని తెలిపింది.
ఈ సందర్భంగా ప్రతి ప్రవాసుడు (Expat) చట్టానికి కట్టుబడి ఉండాలని, వాటిని ఉల్లంఘించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే సామరస్యపూర్వకమైన, చట్టబద్ధమైన వాతావరణాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో వ్యక్తులందరూ ఏర్పాటు చేసిన ఈ చట్టపరమైన నిబంధనలను పాటించాలని, వాటి ఉల్లంఘనలను నివారించాలని సంబంధిత అధికారులు కోరారు. ఇక ఈ చర్యకు చట్టపరమైన ఆధారంగా ఫారినర్స్ రెసిడెన్స్ లా డిక్రీ నంబర్ (17/1959), ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన డిక్రీ-లా నంబర్ (67/1976) ను పేర్కొంది.
NRI: ఈ ఒక్క డాక్యుమెంట్ ఉంటే చాలు.. మీరు 150 దేశాల్లో ఎంచక్కా డ్రైవింగ్ చేసుకోవచ్చు..
Updated Date - 2023-08-19T12:33:39+05:30 IST