UAE WhatsApp scam: నివాసితులకు అలెర్ట్.. అలాంటి సందేశాలకు స్పందిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!
ABN, First Publish Date - 2023-09-17T07:53:45+05:30
యూఏఈ నివాసితులు (Residents) స్కామర్‌ల బారిన పడకుండా అధికారులు అలెర్ట్ జారీ చేశారు. ఇటీవల ఒక స్కామర్ బాదితుడికి వాట్సాప్ (WhatsApp)లో 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ' నుంచి లీగల్ నోటీస్ అంటూ స్కామ్ సందేశం పంపించాడు.
అబుదాబి: యూఏఈ నివాసితులు (Residents) స్కామర్‌ల బారిన పడకుండా అధికారులు అలెర్ట్ జారీ చేశారు. ఇటీవల ఒక స్కామర్ బాదితుడికి వాట్సాప్ (WhatsApp)లో 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ' నుంచి లీగల్ నోటీస్ అంటూ స్కామ్ సందేశం పంపించాడు. దానిని నిశితంగా పరిశీలించి చూస్తే అది నకిలీదని చాలా సులభంగా చెప్పొచ్చు. ఎందుకంటే చట్టపరమైన నోటిఫికేషన్‌లు పేరుతో ఉన్న ఆ పత్రంలో కొన్ని స్పష్టమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏం ఉందంటే.. "క్షమించడం, ప్రియమైన కస్టమర్ కొన్ని భద్రతా కారణాల వల్ల మీ బ్యాంక్ ఖాతా (ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డ్స్) నిలిపివేయబడుతుంది" అని ఉంది. పైగా అందులో కాంటాక్ట్ నంబర్ కూడా చెప్పారు. ఇలాంటి స్కామ్‌లు చాలా తరచుగా జరుగుతుంటాయని, కేటుగాళ్లు యూఏఈ అధికారులమని చెప్పి బాధితుల బ్యాంక్ వివరాలను తెలుసుకుంటారని అధికారులు తెలిపారు.
ఇదే కోవలో ఇటీవల రాస్ అల్ ఖైమా పోలీసులు నివాసితుల బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో నగదు దొంగిలిస్తున్న మోసగాళ్ల బృందాన్ని అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. ఖాతాల అప్‌డేట్ పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS), ఇ-మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని అడుగుతారని అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాంటి అనుమానిత ఫోన్ కాల్స్, సందేశాలు వస్తే వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!
Updated Date - 2023-09-17T07:53:45+05:30 IST