Digital Jobs: సౌదీ సూపర్ ప్లాన్.. ఒకేసారి లక్ష మందికి ట్రైనింగ్..!
ABN, First Publish Date - 2023-09-01T10:45:48+05:30
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సూపర్ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ కార్మిక మార్కెట్ (Digital Labor Market) కు కావాల్సిన నైపుణ్యాలను పొందేందుకు శిక్షణ, సాధికారత కోసం 'ఫ్యూయల్' (Fuel) పేరుతో ఒకేసారి 1లక్ష మందికి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించింది.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సూపర్ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ కార్మిక మార్కెట్ (Digital Labor Market) కు కావాల్సిన నైపుణ్యాలను పొందేందుకు శిక్షణ, సాధికారత కోసం 'ఫ్యూయల్' (Fuel) పేరుతో ఒకేసారి 1లక్ష మందికి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించింది. భవిష్యత్ ఉద్యోగాల కోసం కావాల్సిన నైపుణ్యాలను ఈ శిక్షణా కార్యక్రమంలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (Ministry of Communications and Information Technology) పేర్కొంది. సౌదీలో డిజిటల్ లేబర్ మార్కెట్ కోసం యువతను సిద్ధం చేయడానికి మంత్రిత్వశాఖకు చెందిన ఎస్‌డీఏ (SDA) ద్వారా ఈ ట్రైనింగ్ కార్యక్రమం చేపడుతోంది.
సౌదీ అరేబియా విజన్ 2030 (Saudi Arabia Vision 2030) కి అనుగుణంగా కింగ్‌డమ్‌ను డిజిటల్ రంగంలో మరింత ప్రతిభావంతంగా, బాహుళ భాగస్వామ్యాలను ఆధునాతన కేంద్రంగా మార్చాలని ఈ ఫ్యూయల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యూహాత్మక కార్యక్రమం అనేది డిజిటల్ రంగాలలో తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునే సౌదీ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక దీనిలో భాగంగా 8 పని రంగాలకు సరిపడే 200 కంటే ఎక్కువ శిక్షణా కోర్సులను అందించాలని ఎంసీఐటీ (MCIT) నిర్ణయించింది. కాగా, ఈ కార్యక్రమం డిజిటల్ రంగంలో స్థిరపడాలనుకునే సౌదీ పౌరులకు ఎంతో ఉపయుక్తం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Expats: ప్రవాసుల కోసం కువైత్ బాగానే వెచ్చిస్తుందిగా.. గతేడాది ఏకంగా..
Updated Date - 2023-09-01T10:46:54+05:30 IST