ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్‌నెస్ వార్షిక వేడుకలు

ABN, First Publish Date - 2023-01-29T11:36:59+05:30

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ 49వ వార్షికోత్సవ వేడుకలు, సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో: కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ 49వ వార్షికోత్సవ వేడుకలు, సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేశాయి. 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు, సంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం, నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ముగ్గురు సభ్యులు యోగా, ధ్యానం గురించి వివరించారు. ప్రేక్షకులను పది నిముషాల పాటు కళ్ళు మూసుకోమని అందరిచేత ధ్యానం చేయించారు.

ధ్యానం ముగిసిన వెంటనే హాల్ ప్రేక్షకుల చప్పట్లతో మార్మోగింది. పది నిముషాల ధ్యానంతో తమకు ఎంతో రిలాక్స్‌గా ఉన్నట్లు, మనసు తేలిక అయినట్లు అనుభూతి కలిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. కెనడాలోని హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని బిర్చ్‌మౌంట్ ఫ్రెండ్స్ క్లబ్(BFC), ఒంటారియో తెలుగు ఫౌండేషన్, దుర్హం తెలుగు క్లబ్ సంస్థలు తమవంతు సహకారం అందించాయి. ముఖ్యంగా సూర్య కొండేటి, మురళి రెడ్డి చెర్ల, వెంకట్, సర్దార్ ఖాన్ తమ ప్రసంగాలతో ఎంతో స్ఫూర్తి నిచ్చారు.

హార్ట్ ఫుల్‌నెస్ సంబరాల నిర్వహణను తమ భుజస్కంధాలపై వేసుకుని కనుల పండువగా నిర్వాహించిన ప్రవాస భారతీయులైన విశ్వనాథన్ శ్రీనివాసన్, మోహన్ బోండా, సూర్య కొండేటి, మురళి రెడ్డిచర్ల, వెంకట్ చిలువేరును ఆయా సంస్థల సభ్యులు అభినందించారు. థార్న్‌హిల్‌, ఎంపీపీ లారా స్మిత్, ఎంపీపీ దీపక్ ఆనంద్, థోర్న్‌హిల్ ఎంపీ మెలిస్సా లాంట్స్‌మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరయిన అతిథులందరికీ నిర్వాహకులు చక్కటి విందు ఏర్పాటు చేశారు.

టొరంటో హార్ట్ ఫుల్‌నెస్ నిర్వాహక కార్య దర్శకులు విశ్వనాథన్, మోహన్ బోండా మాట్లాడుతూ హార్ట్ ఫుల్‌నెస్ హృదయపూర్వక లక్ష్యం- నమ్మకం, సహనం, ప్రేమ, ఓర్పు, క్రమశిక్షణ. అంగీకారం వంటి మంచి లక్షణాలను పెంపొందించడంలో మన భావితరాలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, తెలుగు ఔన్నత్యాన్ని ఉన్నత స్థితికి పెంచే మరిన్ని మంచి తెలుగు కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలిపారు.

Updated Date - 2023-01-29T11:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising