ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI Divorce Cases: అమెరికాలో తీసుకున్న విడాకులు.. భారత్‌లో చెల్లుతాయా..? అగ్రరాజ్యంలో ఓ భర్త తన భార్యకు విడాకులు ఇస్తే..!

ABN, First Publish Date - 2023-02-17T13:43:59+05:30

పెళ్లి తర్వాత భారత్ నుంచి చాలామంది విదేశాలకు వెళ్లడం మామూలే. అందులోనూ అమెరికాకు (America) అయితే క్యూ కడుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పెళ్లి తర్వాత భారత్ నుంచి చాలామంది విదేశాలకు వెళ్లడం మామూలే. అందులోనూ అమెరికాకు (America) అయితే క్యూ కడుతుంటారు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు వస్తే కొన్నిసార్లు విడాకుల వరకు వెళ్తుంది. అలాంటి సమయంలో మనోళ్లు అక్కడ విడాకులు తీసుకుంటే అవి మన దగ్గర చెల్లుతాయా? అనేది చాలా మందికి సాధారణంగా వచ్చే డౌటు. దీనికి వచ్చే సమాధానం ఒక్కటే 100కి 100శాతం చెల్లవు. అది కేవలం ఒక ప్రూఫ్‌గా మాత్రమే ఉపయోగపడుతుందట. 'ల్యాండ్ ఆఫ్ లా' ప్రకారం ఎక్కడైతే పెళ్లైందో అక్కడే విడాకులు (Divorce) పొందితేనే వారు సపరేట్ అయినట్లు. అప్పుడే వారి 'స్పౌజ్ స్టేటస్' మారుతుంది. అంతేగానీ అమెరికాలో ఈజీగా విడాకులు దొరుకుతాయని తీసుకుని, మేము విడిపోయాం అనుకుంటే కుదరదు అనేది న్యాయ నిపుణులు చెబుతున్నమాట. అలా పరాయి దేశంలో విడాకులు తీసుకున్నా.. స్వదేశంలో మాత్రం వారి స్టేటస్ భార్యాభర్తలుగానే ఉంటుందట. ఇక్కడ ఆస్తుల పంపకాలు, ఇతర విషయాల్లో వారు కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక యూఎస్ చట్టాల (US Laws) ప్రకారం దంపతులు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టంలేకపోయిన విడాకులు వచ్చేస్తాయి. ఉదాహరణకు భార్య అమెరికాలో ఉండి.. భర్త స్వదేశంలోనే ఉన్నా సమయంలో కూడా ఆమె అక్కడ విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే చాలు అక్కడి న్యాయస్థానం వెంటనే విడాకులు మంజూరు చేసేస్తుంది. అంటే.. అక్కడి చట్టాల ప్రకారం ఇద్దరి సమ్మతితో అవసరం లేదు. అదే మన దగ్గర అలా కాదు. ఇద్దరి సమ్మతితోనే విడాకులు మంజూరు చేస్తారు. ఏ ఒక్కరికి విడిపోవాలని లేకపోయిన విడాకులు రావు. మన దగ్గర చట్టాలు చాలా సుదీర్ఘమైనవి అందుకే విడాకులకు ఏళ్లు పడతాయి. ఇక పెద్దల పంచాయితీలు, అగ్రిమెంట్లు ఇతరాత్ర మార్గలలో దంపతుల విడిపోయిన అవి కూడా విడాకులు తీసుకున్నట్లు కాదు. కేవలం కోర్టు అనుమతితో విడిపోయిన సందర్భంలోనే అది విడాకుల కిందికి వస్తుంది.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టా రీల్స్ కోసం ఈ యువతి వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది..!

ఇక విదేశాల్లో ఉన్నవారు అక్కడి నుంచి మన దగ్గర విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, విదేశాల్లో ఉన్న భార్య లేదా భర్త స్వదేశంలో విడాకుల కోసం దరఖాస్తు చేయాలంటే.. ముందుగా వారు ఉన్న ప్రదేశంలోని కోర్టు ద్వారా నోటరీ సిద్ధం చేసి దాన్ని తన కుటుంబ సభ్యులకు పంపించాల్సి ఉంటుంది. ఆ నోటరీని తీసుకుని వారి తరఫున సంబంధీకులు తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలి. అదే సమయంలో న్యాయస్థానం ఆదేశిస్తే విదేశాల్లో ఉన్న భార్య లేదా భర్త కూడా కోర్టు ముందు ఒకసారి హాజరు కావడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో మాత్రమే విదేశాల్లో ఉన్న వారు ఇక్కడి రాకున్న విడాకులు పొందే వీలు ఉంటుంది. కానీ, సాధారణంగానైతే తప్పనిసరిగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందే.

ఇది కూడా చదవండి: టెర్రస్‌పై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-02-17T15:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising