ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Expats: ప్రవాసుల కోసం కువైత్ బాగానే వెచ్చిస్తుందిగా.. గతేడాది ఏకంగా..

ABN, First Publish Date - 2023-09-01T08:02:21+05:30

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికం. అందులోనూ భారతీయ ప్రవాసులు (Indian Expats) భారీగా ఉన్నట్లు అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికం. అందులోనూ భారతీయ ప్రవాసులు (Indian Expats) భారీగా ఉన్నట్లు అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా ప్రకారం ఈ గల్ఫ్ దేశం ప్రవాసుల కోసం బాగానే వెచ్చిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఇచ్చే బెనిఫిట్స్, ఇతర నష్ట పరిహారాల రూపంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు చేసిందనే అధికారిక గణాంకాలు తాజాగా విడులయ్యాయి. ఈ నివేదిక ప్రకారం సర్వీస్ బెనిఫిట్స్ రూపంలో నాన్-కువైటీల (Non-Kuwaitis) కోసం గత ఆర్థిక సంవత్సరంలో కువైత్ ఏకంగా 31.47 మిలియన్ కువైటీ దినార్లు (సుమారు రూ.831కోట్లు) చెల్లించిందట.

అలాగే ఉద్యోగ ఒప్పందాలు, సంబంధిత నిర్ణయాలు, సివిల్ సర్వీస్ లా నం. 15/1979 కార్యనిర్వాహక నిబంధనలు మరియు గల్ఫ్ సహకార మండలి ఆమోదించిన అనుబంధ సంస్థలను నియంత్రించే నిబంధనలకు అనుగుణంగా బోనస్‌లు చెల్లించినట్లు ఈ నివేదిక ధృవీకరించింది. ఇక అధికారిక గణాంకాల ప్రకారం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను కార్మికుల పరిహారం (Workers Compensation) కోసం కువైత్ ఖర్చు చేసిన మొత్తం KD8.502 బిలియన్లకు (రూ.21,44,00,38,08,800) చేరింది. అదనంగా నాన్-కువైటీల ఆరోగ్య బీమా (Health insurance) కోసం గత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన వ్యయం KD4.6 మిలియన్లు (సుమారు రూ.123కోట్లు) అని తెలిసింది. ఇలా గల్ఫ్ దేశం కువైత్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో వలస కార్మికుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది.

Kuwait: దేశం నుంచి వెళ్లగొడుతున్న ప్రవాసుల విషయంలో కువైత్ మరో కీలక నిర్ణయం..!

Updated Date - 2023-09-01T08:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising