ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NATS: టంపాబేలో స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించిన 'నాట్స్'

ABN, First Publish Date - 2023-08-24T08:59:52+05:30

అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరో కార్యక్రమాన్ని చేపట్టింది.

టంపాబే: అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించింది. టంపాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ)లో నాట్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ టంపాబే చేపట్టిన ఈ స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ ఘనంగా జరిగింది. నాట్స్ సభ్యులు, స్థానికంగా ఉండే తెలుగువారు చాలా మంది కలిసి స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ విజయవంతం చేశారు. నాట్స్, ఎఫ్.ఐ.ఏ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పోటీలు నిర్వహించి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపారు. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఈ పరేడ్‌లో భాగస్వాములు అయ్యారు. భారత స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన యోధుల గురించి తమ పిల్లలకు తలిదండ్రులు తెలియజేశారు. నేటి తరం చిన్నారుల్లో సేవాభావాన్ని, భారత్ పట్ల ప్రేమను పెంపొందించడానికి నాట్స్, ఎఫ్.ఐ.ఎ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ అమెరాకలో తెలుగు వారి ఐక్యత, భారతీయుల సమైక్యతను ప్రతిబింబించిందని నాట్స్ సేర్కొంది.

నాట్స్, ఎఫ్.ఐ.ఏతో పాటు ఇతర భారతీయ సంస్థలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. నాట్స్ చేపట్టిన స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ విజయవంతం చేయడానికి రాజేష్ కాండ్రు, సుధాకర్ మున్నంగి, భాను ధూళిపాళ్ల, భాస్కర్ సోమంచి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ అధ్యక్షులు నవీన్ మేడికొండ, హరి మండవ, భార్గవ్ మాధవరెడ్డి, భాస్కర్ సోమంచి ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ వర్క్‌షాప్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.

భావితరంలో దేశభక్తిని నింపేందుకు స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ గొప్పతనాన్ని చాటి, మన స్వాతంత్ర్య వీరుల త్యాగాలను గుర్తు చేసేలా టంపాబే విభాగం స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-08-24T08:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising