ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raj Chetty: ఆర్థికవేత్త రాజ్ చెట్టికి హార్వర్డ్ వర్సిటీ అవార్డు.. తొలి ఇండో అమెరికన్‌గా రికార్డు!

ABN, First Publish Date - 2023-08-16T12:56:04+05:30

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University) ఇచ్చే ప్రతిష్టాత్మక జార్జి లెడ్లీ అవార్డుకి భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త రాజ్‌ చెట్టి ఎంపికయ్యారు.

హ్యూస్టన్‌: హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University) ఇచ్చే ప్రతిష్టాత్మక జార్జి లెడ్లీ అవార్డుకి భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త రాజ్‌ చెట్టి ఎంపికయ్యారు. ఆయనతో పాటు కోవిడ్ (COVID-19) మ‌హ‌మ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి మెరుగైన, వేగవంతమైన పరీక్షా విధానాన్ని రూపొందించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని సిస్టమ్స్ బయాలజీ ప్రొఫెసర్ అయిన బయాలజిస్ట్ మైఖేల్ స్ప్రింగర్ (Michael Springer) కూడా ఈ పురస్కారం ల‌భించింది. విజ్ఞానశాస్త్రానికి, మానవాళికి గొప్ప సేవలు చేసిన హార్వర్డ్‌ కమ్యూనిటీ సభ్యులకు ప్రతి రెండేళ్లకు ఓసారి ఈ అవార్డులు అందజేయడం జరుగుతుంది.

ఢిల్లీలో జన్మించిన రాజ్ చెట్టి ప్రస్తుతం హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికన్‌ డ్రీమ్‌ (American Dream) సాకారంలో అపోహలను ఛేదించడానికి బిగ్‌ డాటా వినియోగంపై కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. కాగా, ఆర్థిక‌రంగంలో విశేష కృషిచేసిన 40 ఏళ్లలోపు అమెరికన్ ఆర్థికవేత్తల‌కు జార్జ్ లెడ్లీ అవార్డు (George Ledlie Award) ను ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం గెలుచుకున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి చెట్టి కావ‌డం విశేషం.

Indian Student: 'ఇది కదా దేశభక్తి అంటే'.. ఈ భారతీయ విద్యార్థి వీడియో చూస్తే గూస్‌బమ్స్‌ రావడం పక్కా!

ఈ సందర్భంగా రాజ్ చెట్టి మాట్లాడుతూ.. తనకు దక్కిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "తొమ్మిదేళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి అమెరికాకు వచ్చా. దక్షిణ భారతదేశంలోని అల్పాదాయ కుటుంబాల నుంచి నా తల్లిదండ్రులు వచ్చారు. ఉన్నతవిద్య వారిద్దరికీ గొప్ప అవకాశాలు కల్పించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆ రోజుల్లో కుటుంబం నుంచి ఒకరిని ఎంపిక చేసుకొని మంచి చదువు చెప్పించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలందరినీ ఆ స్థాయిలో చదివించే ఆర్థిక స్తోమతలు ఉండేవి కావు. రెండు కుటుంబాల్లోనూ నా తల్లిదండ్రులు ‘ఆ ఒక్కరు’గా అవకాశాలు పొందారని" రాజ్‌ చెట్టి చెప్పుకొచ్చారు.

Foreign Tour Packages: విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

Updated Date - 2023-08-16T12:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising