ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian American: ఈ ఎన్నారై బాలిక చాలా గ్రేట్.. 16 ఏళ్ల వయసులో ఎంతమందికి ఇలాంటి ఆలోచన ఉంటది చెప్పండి..!

ABN, First Publish Date - 2023-08-08T11:20:59+05:30

ఆమె వయసు చిన్నదే. కానీ, ఆలోచన మాత్రం చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే గొప్ప మనసున్న అమ్మాయి. లేకుంటే పదహారేళ్ల వయసులో ఎంతమంది ఆమెలా ఆలోచించగలరు చెప్పండి.

ఎన్నారై డెస్క్: ఆమె వయసు చిన్నదే. కానీ, ఆలోచన మాత్రం చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే గొప్ప మనసున్న అమ్మాయి. లేకుంటే పదహారేళ్ల వయసులో ఎంతమంది ఆమెలా ఆలోచించగలరు చెప్పండి. సొంతవాళ్లనే పట్టించుకునేవారు కరువైపోయిన ఈ కాలంలో పక్కవారి బాగు కోసం ఆలోచించడమంటే నిజంగా ఈ ఎన్నారై బాలిక చాలా గ్రేట్ కదూ. 16 ఏళ్ల వయస్సులో భారతీయ అమెరికన్ తనిష్క ధరివాల్ (Tanishka Dhariwal) ప్రజల బాధలను అర్థం చేసుకుంది. అలా పక్కవారికోసం చాలా గొప్ప పని చేసి, ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. అసలు తనిష్క చేసిన ఆ గొప్ప పనేంటి? ఆమెను అందరూ అంతలా మెచ్చుకోవడానికి కారణం ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే మనం ఈ కథనం చదవాల్సిందే.

ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఒడిశాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 294 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన అమెరికాలో ఉండే తనిష్కను తీవ్రంగా కలిచివేసింది. దీంతో ఈ ఘటన బాధితులకు తన వంతుగా ఎంతోకొంత సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తన ప్రయత్నం మొదలెట్టింది. ఎంతో కష్టపడి 'పీఎం కేర్స్ ఫండ్' కోసం 10,000 డాలర్లకు (దాదాపు రూ.8 లక్షల 30 వేలు) పైగా నిధులను సేకరించింది. తనిష్క నిధుల సేకరణకు ఆమె స్నేహితులు కూడా మద్ధతుగా నిలిచారు. దీనికోసం ఆమె 'గోఫండ్‌మీ' (GoFundMe) పేజీని ఏర్పాటు చేసింది. అలాగే స్కూల్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసి నిధులను కూడగట్టింది.

Expats: 100 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్.. కారణమిదే..!


అనంతరం ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన విరాళాల కార్యక్రమంలో తనిష్క తాను సేకరించిన మొత్తాన్ని భారత కాన్సుల్ జనరల్ (Indian Consul General) రణధీర్ జైస్వాల్‌ (Randhir Jaiswal) కు అందజేసింది. ఆమె తల్లిదండ్రులు నితిన్, సప్నా ధరివాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎన్నారైలు హరిదాస్ కొటేవాలా, అశోక్ సంచేటి, రవి జార్గర్, చంద్ర సుఖ్వాల్‌తో సహా రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Rajastan Association of North America) ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. తనిష్క చేసిన ప్రయత్నాలను 'రానా' (RANA) అధ్యక్షుడు, జైపూర్ ఫుట్ యూఎస్ఎ వ్యవస్థాపక ఛైర్మన్ ప్రేమ్ భండారీ ప్రశంసించారు. ఇక తనిష్క విషయం బయటకు రావడంతో ఆమెను వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో ఎంతో పరిణితితో కూడిన ఆలోచన అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Visit visas: ఆ ఎనిమిది దేశాల పర్యాటకులకు సౌదీ గుడ్‌న్యూస్

Updated Date - 2023-08-08T11:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising