ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Neeli Bendapudi: భారతీయ అమెరికన్ తెలుగు మహిళా విద్యావేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం

ABN, First Publish Date - 2023-04-26T09:15:13+05:30

భారతీయ అమెరికన్ మహిళా విద్యావేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయ అమెరికన్ మహిళా విద్యావేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. అగ్రరాజ్యం అమెరికాలో (America) ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకుగాను ఈ ఏడాది 'ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డ్'కు ( Immigrant Achievement Award ) తెలుగు మహిళ నీలి బెండపూడి (Neeli Bendapudi) ఎంపికయ్యారు. ప్రతి ఏడాది అమెరికా వారసత్వం పట్ల నిబద్ధత, అంకితభావాన్ని ప్రదర్శించే వ్యక్తికి గానీ, సంస్థకు గానీ ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన జరిగే డీసీ ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో నీలి బెండపూడి ఈ పురస్కారం అందుకుంటారు.

ఇక గత 30 ఏళ్ల నుంచి యూఎస్‌లో ఉన్నత విద్య కోసం (Higher Education in the US) నీలి బెండపూడి ఎంతో కృషి చేస్తున్నారని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరెమీ రాబిన్స్ (Jeremy Robbins) కొనియాడారు. సమగ్ర నైపుణ్యాన్ని పెంపొందించడం, విద్యార్ధులు, అధ్యాపకులు, సిబ్బంది అభివృద్ధి చెందడానికి అవకాశాలను సృష్టించేందుకు ఆమె ఎంతో శ్రమించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదిలాఉంటే.. నీలి బెండపూడి విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఎంబీఏ పట్టాను పొందారు. ఆ తర్వాత 1986లో ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కాన్సాస్ యూనివర్సీటి నుంచి మార్కెటింగ్‌లో డాక్టరేట్‌ అందుకున్నారు. డాక్టర్ వెంకట్ బెండపూడితో ఆమెకు వివాహమైంది. ఆయన ఒహియో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌, యూనివర్సిటీ ఆఫ్ లూయిస్‌విల్లేలో అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

Canada: వీడిన భారతీయ యువతి మర్డర్ మిస్టరీ.. హంతకుడి గుర్తింపు.. కిల్లర్ కోసం దేశవ్యాప్తంగా వేట..!


కాగా, నీలి బెండపూడి.. కెంటుకీలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీలో (University of Louisville in Kentucky) మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వహించారు. కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో (University of Kansas) స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ ఫౌండింగ్ డైరెక్టర్‌గానూ ఆమె విధులు నిర్వర్తించారు. 2022లో ఆమె ఏకంగా ప్రఖ్యాత పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (Pennsylvania State University) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా నీలి బెండపూడి చరిత్రకెక్కారు.

Indian American: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం..!

Updated Date - 2023-04-26T09:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising