ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Emirates Draw: ప్చ్.. సింగిల్ డిజిట్ తేడాతో భారతీయుడికి రూ.226కోట్ల జాక్‌పాట్ మిస్..!

ABN, First Publish Date - 2023-10-06T10:46:15+05:30

దుబాయిలో ఉండే ఓ భారత వ్యక్తి (Indian Man) కేవలం సింగిల్ డిజిట్ తేడాతో ఏకంగా రూ.226కోట్లు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. 'మేగా7' (MEGA7) పేరిట తాజాగా నిర్వహించిన ఎమిరేట్స్ డ్రాలో ఇలా మనోడ్ని దురదృష్టం వెంటాడింది.

దుబాయ్: దుబాయిలో ఉండే ఓ భారత వ్యక్తి (Indian Man) కేవలం సింగిల్ డిజిట్ తేడాతో ఏకంగా రూ.226కోట్లు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. 'మేగా7' (MEGA7) పేరిట తాజాగా నిర్వహించిన ఎమిరేట్స్ డ్రా (Emirates Draw) లో ఇలా మనోడ్ని దురదృష్టం వెంటాడింది. భారతీయుడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్‌లోని ఆరు డిజిట్లు మ్యాచ్ కాగా, చివరి డిజిట్ మాత్రం తేడా కొట్టింది. దాంతో మనోడికి 100 మిలియన్ దిర్హమ్ల ఫస్ట్ ప్రైజ్ మిస్ అయింది. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 226.93కోట్లు. ఇలా మనోడిని బ్యాడ్‌లక్ వెంటాడడంతో సెకండ్ ప్రైజ్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గత 27 ఏళ్లుగా భారత ప్రవాసుడు అలెక్స్ జెవియర్ ఫెర్నాండెస్ (Alex Xaveier Fernandes) యూఏఈ (UAE) లో నివాసం ఉంటున్నాడు. అక్కడి ఓ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడిచిన కొన్ని నెలల నుంచి ఎమిరేట్స్ డ్రా (Emirates Draw) లో పాల్గొంటున్నాడు. ఇంతకుముందు 'ఫాస్ట్5', 'ఈజీ6' డ్రాలలో టికెట్లు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా గెలిచిన చిన్న మొత్తాలను ఒక ఖాతాలో జమ చేశాడు. ఆ డబ్బులతో మళ్లీ 'మెగా7'లో టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా దీని డ్రా తీశారు నిర్వాహకులు. ఇందులో అలెక్స్ జెవియర్ టికెట్ నంబర్‌లోని మొదటి ఆరు నంబర్లు సరిగ్గా సరిపోయాయి. కానీ, చివరి డిజిట్ మాత్రం మ్యాచ్ కాలేదు. అలా లాటరీ టికెట్ నం.లోని ఏడుకు ఏడు డిజిట్లు మ్యాచ్ అయినవారికి మొదటి బహుమతి కింద రూ.226కోట్లు ఇస్తారు. అయితే, మనోడికి చివరి డిజిట్ మ్యాచ్‌కాకపోవడంతో సెకండ్ ప్రైజ్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇలా సింగిల్ డిజిట్‌తో భారత ప్రవాసుడు (Indian expat) కి భారీ జాక్‌పాట్ మిస్ అయింది.

ఇక సెకండ్ ప్రైజ్ కింద అలెక్స్ జెవియర్ 2.50లక్షల దిర్హమ్స్ (రూ.56లక్షలు) గెలుచుకున్నాడు. అయితే, ఈ గెలుపు కూడా తనకు ఆనందాన్ని ఇచ్చేదేనని, భవిష్యత్‌లో తప్పనిసరిగా తాను విజేతగా నిలుస్తానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే తాను గెలిచిన ఈ భారీ నగదులో కొంత మొత్తం తనకు అనేక అవకాశాలను అందించిన దుబాయ్ నగరానికి తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. మరికొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించడం ద్వారా అభాగ్యుల పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలనుకుంటున్నానని అలెక్స్ జెవియర్ చెప్పుకొచ్చాడు.

Kuwait: దేశం నుంచి బహిష్కరించిన ప్రవాసుల విషయంలో.. తీవ్ర ఆందోళనలో కువైత్ బ్యాంకులు..!


Updated Date - 2023-10-06T10:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising