ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian expat: విజిట్ వీసాపై యూఏఈ వెళ్లిన భారత వ్యక్తి.. ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు.. చివరికి

ABN, First Publish Date - 2023-09-09T08:14:41+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది.

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది. చివరికి అక్కడి స్థానిక సామాజిక కార్యకర్తల సాయంతో అతడు స్వదేశానికి తిరిగి పయనమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాకు చెందిన మోహసిన్ (Muhsin) ఈ ఏడాది ఏప్రిల్‌లో విజిట్ వీసా (Visit Visa) పై యూఏఈ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర ధృవపత్రాలు కలిగిన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు. దాంతో తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో వీసా స్టేటస్‌ను కూడా మార్చుకోకపోవడంతో ఓవర్‌స్టే (Overstay) జరిమానాలు భారీగా పెరిగిపోయాయి. అద్దె చెల్లించలేక పార్కులో ఉండడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో అతడు ఒకరోజు ఓ పార్కులో స్థానిక సామాజిక కార్యకర్తల కంటబడ్డాడు. మోహిసిన్‌ను వాకాబు చేయడంతో వారికి అసలు విషయం తెలిసింది. దాంతో అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన సామాజిక కార్యకర్తలు సియాఫ్ మట్టంచెరి, రహీమా షనీద్.. యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలాం పప్పినిస్సేరితో పాటు కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (Kerala Muslim Cultural Center), దుబాయి, షార్జా, అజ్మాన్ కార్మికుల సాయంతో మోహిసిన్ ఓవర్‌స్టే ఫైన్స్ క్లీయర్ చేశారు. అలాగే దుబాయిలోని భారత కాన్సులేట్ (Indian Consulate) నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అవుట్‌పాస్ వచ్చేలా చేశారు. ఆ తర్వాత సామాజిక కార్యర్తలు తమ సొంత డబ్బులతో అతనికి విమాన టికెట్లు కొనుగోలు చేసి తిరిగి కేరళకు పంపించారు.

Expatriates: కువైత్‌లో ప్రవాసుల అప్పు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Updated Date - 2023-09-09T08:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising