ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల పాటు..!

ABN, First Publish Date - 2023-07-28T11:09:43+05:30

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

ఎన్నారై డెస్క్: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇదిగో ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. తొలిసారి పాల్గొన్న డ్రాలోనే మనోడికి జాక్‌పాట్ తగిలింది. ఇక నుంచి భారత వ్యక్తికి 25ఏళ్ల పాటు ప్రతినెల 25వేల దిర్హమ్స్ (రూ.5.60లక్షలు) వస్తాయి. 'ఫాస్ట్5 ఎమిరేట్స్ డ్రా' (FAST5 Emirates draw) లో కేవలం 25 దిర్హమ్స్ పెట్టి కొన్న టికెట్‌కు దుబాయిలో ఉండే మహ్మద్ అదిల్ ఖాన్‌ అనే భారతీయుడికి ఇలా అదృష్టం వరించింది.

ఈ సందర్భంగా అదిల్ ఖాన్ మాట్లాడుతూ.. "ఎమిరేట్స్ డ్రాలో పాల్గొన్న మొదటిసారే విజేతగా నిలవడం అనేది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నిర్వాహకుల నుండి నాకు కాల్ వచ్చినప్పుడు, మొదట నమ్మలేకపోయాను. కానీ, ఆ తర్వాత వారు చెప్పిన వివరాలతో ఒక్కసారిగా ఎగిరిగంతేసినంత పని చేశాను. వచ్చే 25 సంవత్సరాలకు నెలవారీ 25వేల దిర్హమ్స్ వస్తాయి. త్వరగా పదవీ విరమణ చేయవచ్చు. ఇక నా భవిష్యత్తు సురక్షితం" అని చెప్పుకొచ్చాడు. కాగా, 33ఏళ్ల అదిల్ ఖాన్ దుబాయిలో ఐదేళ్లుగా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు.

US Visa: అమెరికా వెళ్లే భారతీయుకులకు తీపి కబురు.. వీసా మంజూరుపై అగ్రరాజ్యం కీలక నిర్ణయం

Updated Date - 2023-07-29T07:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising