NRI News: అమెరికాలో వైసీపీ సైకోలు.. ఏపీ విద్యార్థిపై వైసీపీ నేత వెంకటేశ్‌రెడ్డి రాక్షసత్వం
ABN, First Publish Date - 2023-12-02T09:00:41+05:30
ముఖం నుంచి అరికాలు వరకు వైరు దెబ్బలు, పైపులతో కొట్టిన గాయాలు! శరీరంపై సందు లేకుండా వాతలు! పిడిగుద్దులకు, కొట్టిన రాడ్ల దెబ్బలకు పటపటా విరిగిన పక్కటెముకలు! ఉన్నత చదువులపై ఆశతో అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థికి అక్కడ వైసీపీ యువనేత, అతని అనుచరులు చూపించిన నరకం ఇదీ!
ఏపీ విద్యార్థిపై వైసీపీ నేత వెంకటేశ్‌రెడ్డి రాక్షసత్వం
రోజూ నరకం..కరెంటు వైరు, పైపులతో చిత్రహింసలు
బాధితుడు వెంకటేశ్ చుట్టం.. విద్యకోసం యూఎస్‌కు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంట్లో దాచిపెట్టిన వెంకటేశ్
3 ఇళ్లలో చాకిరీ.. మసాజ్ చేయించుకున్న వైనం
మిస్సోరిలో మరో ఇద్దరితో కలిసి బాధితుడికి చిత్రవథ
ఓ వ్యక్తి సమాచారంతో రంగంలోకి పోలీసులు
శరీరంపై గాయాలు, విరిగిన ఎముకలతో బాధితుడు
చలించిన పోలీసులు.. ముగ్గురూ అరెస్టు, రిమాండ్
కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, దాడి అభియోగాలు
అరెస్టు టైంలో జగన్‌తో ఫొటోలు చూపిన వెంకటేశ్
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ముఖం నుంచి అరికాలు వరకు వైరు దెబ్బలు, పైపులతో కొట్టిన గాయాలు! శరీరంపై సందు లేకుండా వాతలు! పిడిగుద్దులకు, కొట్టిన రాడ్ల దెబ్బలకు పటపటా విరిగిన పక్కటెముకలు! ఉన్నత చదువులపై ఆశతో అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థికి అక్కడ వైసీపీ యువనేత, అతని అనుచరులు చూపించిన నరకం ఇదీ! రోజంతా చాకిరీ చేయిస్తూ సరైన తిండి పెట్టకుండా బాత్రూమ్ కూడా లేని బేస్‌మెంట్‌లో ఏడు నెలలు బందీగా ఉంచిన బాధితుడిని మిస్సోరి పోలీసులు రక్షించారు. అధికార మదంతో అరాచకాలు సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన వైసీపీ.. వాటిని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికీ తీసుకెళ్లింది. జగన్ పార్టీ యువ నేత సత్తా రు వెంకటేశ్ రెడ్డి.. ఏపీకి చెందిన యువకుడిని అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో బంధించి ఏడు నెలల పాటు మరో ఇద్దరితో కలిసి చిత్రహింసలకు గురి చేశాడు. ఇంటి బేస్‌మెంట్‌లో దాచిపెట్టి, అమానవీయంగా దాడిచేస్తూ రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఒళ్లు హూనమయ్యేలా ఎలక్ట్రిక్ వైర్లు, కర్రలు, రాడ్లు, చెక్క బోర్డులు, పీవీసీ పైపులతో కొడుతూ నుదుటి నుంచి పాదాల వరకూ శరీరాన్ని తీవ్ర గాయాల పాలుచేశాడు. పక్కటెముకలు విరిగేలా కొడుతూ వాటిని వీడియోలు తీసి ఒకరికి మరొకరూ చూపిస్తూ పైశాచికత్వం పొందారు. మానవ అక్రమ రవాణా, యువకు డి అక్రమ నిర్బంధం, హింసాత్మ దాడి తదితర నేరాల కింద అభియోగాలు మోపిన అక్కడి పోలీసులు.. ముగ్గురు శాడిస్టులనూ కటకటాల్లోకి నెట్టారు. ముగ్గురిలో సత్తారు వెంకటేశ్‌రెడ్డి వైసీపీ యువజన విభాగం నాయకుడు. పెన్మత్స నిఖిల్ వర్మ, పెన్మత్స శ్రవణ్ వర్మ ఈ దారుణంలో పాలు పంచుకున్న మరో ఇద్దరు నిందితులు. అరెస్టు సమయంలో ప్రభుత్వ పెద్దతో (జగన్‌తో) తాను దిగిన ఫొటోను సత్తారు పోలీసులకు చూపించినట్టు సమాచారం.
బేస్‌మెంట్‌లో బండలపై నిద్ర..
ఏపీకి చెందిన విద్యార్థి ఒకరు అమెరికాలోని మిస్సోరి వర్శిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలనే ఉద్దేశంతో గతఏడాది భారత్‌నుంచి అమెరికాకు వెళ్లా డు. అతడు వెంకటేశ్‌రెడ్డికి బంధువు అని చెబుతున్నారు. సత్తారు తన భార్య, పిల్లలతో సెంట్‌లూయిస్ నగరంలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రి ల్ నుంచి బాధితుడిని ఇంటి బేస్‌మెంట్‌లో సత్తారు బంధించాడు. రోజూ నరకం చూపించాడు. ప్రతిరోజూ ముగ్గురి ఇళ్లలో పనిచేయాలి. వెంకటేశ్ రెడ్డికి రెండు గంటలపాటు మసాజ్ చేయా లి. ఆ తర్వాత బేస్‌మెంట్‌లోని కాంక్రీటు బండలపై పడుకోవాలి. వేకువజామున 4.30గంటలకు నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకూ గొడ్డు చాకిరి చేయించేవారు. బాధితుడు బయటకు రాకుండా తాళం వేసేవారు.
ఒక మనిషిని మరోమనిషి ఇంత హింసిస్తాడా?
నీరసంగా ఉన్న బాధితుడు మిస్సోరిలోని రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి కంటపడ్డాడు. బాధితుడి దుస్థితి గమనించిన ఆ వ్యకి.్త దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాడు. తన దుస్థితిని వాట్సాప్ ద్వారా బుధవారం ఆ వ్యక్తికి తెలియజేస్తూ బాధిత విద్యార్థి రక్షించాలంటూ వేడుకున్నాడు. చలించిన ఆయన అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశాడు. అక్క డికి వెళ్లిన పోలీసులు బాధితుడి పరిస్థితి చూసి చలించిపోయారు. ముఖం నుంచి కాళ్లవరకు అన్నీ గాయాలతో, శరీరమంతా వాతలతో, విరిగిన ఎముకలతో బాధపడుతున్న అతని పరిస్థితికి దిగ్ర్బాంతి చెందారు. ఒక మనిషిని మరో మనిషి ఇంతలా హింసిస్తాడా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
‘పెద్దల’తో ఫొటోలు చూపిన సత్తారు
ఏపీలో రాజకీయ పార్టీకి చెందిన పెద్దలతో తనకున్న సంబంధాలపై నిందితుడు వెంకటేశ్ రెడ్డి... ఫోటో(జగన్‌తో) ప్రదర్శించినట్లు అక్కడి ప్రాసిక్యూటర్ మెక్ కల్లోచ్ వెల్లడించారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి మిస్సోరిలోని భారతీయ ఎన్నారైలకు తెలియజేశారు.
అదే ఏపీలో అయితే..
ఎవరిపై దాడి చేస్తారో.. ఎవరి భూమి ఆక్రమిస్తారో.. ఎవర్ని పోలీసు కేసుల్లో ఇరికిస్తారో.. అనే భయంతో క్షణక్షణం బిక్కు బిక్కుమని బతికే ఏపీలో వైసీపీ నేతల దాడులకుగురైన బాధితుడికి న్యాయం జరిగేదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎక్కడ వైసీపీ అరాచకాలు సృష్టించినా వత్తాసు పలికే పోలీసులు అధికారపక్ష నేతల ముందు ఎవరైనా తుమ్మినా అపశకునం అంటూ చితకబాది కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. ఇనుప ముక్కల దొంగలు కోర్టులో పడి మంత్రికి ఇ బ్బంది కలిగించే డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారని నెల్లూరు పోలీసులు, డ్రైవర్ శవాన్ని పార్సిల్ చేసిన వైసీ పీ ఎమ్మెల్సీ.. బుద్ధి మాటలు చెప్పారని కాకినాడ పోలీసులు, ప్యాంటు విప్పి చూపించిన ఎంపీ వీడి యో వైరల్ చేసిన వ్యక్తిని వదలబోమంటూ కేసు పెట్టిన అనంతపురం పోలీసులతోపాటు వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే ఎఫ్‌ఐఆర్ కట్టిన చరిత్ర కడప పోలీసులది. అయితే అమెరికాలో ఉన్న పోలీసులు వైసీపీ నేతల మాట వినేరకం కాదు గనుక నిందితులను జైలుకు పంపారు.
Updated Date - 2023-12-02T09:00:43+05:30 IST