ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abu Dhabi Big Ticket: రూ.45కోట్లు గెలిచిన భారతీయుడు.. తీరా లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..!

ABN, First Publish Date - 2023-04-05T10:39:53+05:30

అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో (Abu Dhabi Big Ticket Draw) మరో భారతీయ ప్రవాసుడి పంట పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో (Abu Dhabi Big Ticket Draw) మరో భారతీయ ప్రవాసుడి పంట పడింది. ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో సుమారు రూ. 45కోట్లు. అయితే, లాటరీ నిర్వాహకులు భారత ప్రవాసుడికి ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. విజేతగా నిలిచిన విషయం అతడికి చేరేవేసేందుకు వేరే మార్గల్లో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక రాజధాని బెంగళూరు‌కు చెందిన అరుణ్ కుమార్ వటాకీ కోరోత్ (Arun Kumar Vatakke Koroth) అనే వ్యక్తికే తాజాగా ఈ బంపర్ లాటరీ తగిలింది. అతడు మార్చి 22న కొనుగోలు చేసిన సిరీస్ నం. 250, టికెట్ నం. 261031కే తాజాగా నిర్వహించిన డ్రాలో జాక్‌పాట్ (Jackpot) తగిలింది. దాంతో అరుణ్ కుమార్ 20 మిలియన్ దిర్హమ్స్ (రూ.44.71కోట్లు) గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని అతనికి తెలియజేసేందుకు షో హోస్ట్ రిచర్డ్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశారు. కానీ, అవతలివైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. ఇతర మార్గల్లో ప్రయత్నించి అరుణ్ కుమార్‌కు ఈ గ్రాండ్ ప్రైజ్‌ను అందజేస్తామని రిచర్డ్ చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. ఇదే డ్రాలో మరో ఇద్దరు భారతీయులు (Indians) కూడా భారీ మొత్తం గెలుచుకున్నారు. బహ్రెయిన్‌లో ఉండే సురేష్ మాథన్ (Suresh Mathan) సెకండ్ ప్రైజ్ రూపంలో 1లక్ష దిర్హమ్స్ (రూ.22.35లక్షలు) గెలుచుకున్నాడు. మార్చి 27వ తేదీన అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 018462కు ఈ జాక్‌పాట్ తగిలింది. ఇక మూడో ప్రైజ్ రూపం 9వేల దిర్హమ్స్ (రూ.20.12లక్షలు) గెలుచుకున్నాడు ఒమాన్‌లో (Oman) ఉండే మరో భారతీయ ప్రవాసుడు (Indian Expat) ముహమ్మద్ షెఫెక్. మార్చి 28న అతడు కొన్న టికెట్ నం. 333142కు లాటరీ తగలడంతో భారీ మొత్తం షెఫెక్ సొంతమైంది. ఇలా ముగ్గురు భారతీయ ప్రవాసులు ఒకే డ్రాలో భారీ నగదు గెలుచుకోవడం విశేషం.

Kuwait: ప్రవాసుల వీసా రెన్యువల్.. గతేడాది కువైత్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Updated Date - 2023-04-05T10:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising