ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indians: బ్రిటన్‌లో విదేశీయులపై కొరడా.. చట్టవిరుద్ధంగా ఉద్యోగం.. అరెస్ట్ అయినవారిలో భారతీయులు

ABN, First Publish Date - 2023-04-27T09:11:51+05:30

అక్రమ వలసలతో(Illegal Migrations) సతమతమవుతున్న యునైటెడ్ కింగ్‌డమ్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: అక్రమ వలసలతో(Illegal Migrations) సతమతమవుతున్న యునైటెడ్ కింగ్‌డమ్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను చెక్ పెట్టేందుకు యూకే ప్రభుత్వం (UK Government) గత కొన్నిరోజులుగా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. బ్రిటన్ (Britain) అధికారులు విదేశీయుల్ని సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న దాదాపు 60 మంది మోపెడ్ డ్రైవర్లని( Moped Drivers) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్టైన వారిలో బ్రెజిలియన్లు, అల్జీరియన్లతో పాటు ఇండియన్స్ కూడా ఉన్నారని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పనిచేయడం, నకిలీ ధృవపత్రాలు కలిగి ఉండటం వంటి నేరాలకు గాను వీరిని అదుపులోకి తీసుకున్నట్లు యూకే హోం ఆఫీస్ (Home Office) తెలిపింది.

ఇక 2023 జనవరి, మార్చి మధ్యకాలంలో చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్ ఛానెల్‌ను అక్రమంగా దాటుతున్న వలసదారుల్లో (Migrants crossing the English Channel illegally) భారతీయులు రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 31 మార్చి 2023 మధ్య చిన్న పడవ ద్వారా యూకేకు వచ్చిన అక్రమ వలసదారుల్లో మొదటి రెండు స్థానాల్లో ఆఫ్ఘన్‌లు(909), భారతీయులు(675) ఉన్నారు. 2023 మొదటి త్రైమాసికంలో ఈ సంఖ్య 2022లో నమోదైన 683 మంది భారతీయులలో దాదాపు సమానం. కాగా, ఇలాంటి వారి వల్ల ఇంగ్లండ్ సమాజం తీవ్రంగా నష్టపోతుందని భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ (Suella Braverman) అన్నారు. నిజాయితీపరులైన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు ప్రజాధనం వృథా అవుతుందని ఆమె పేర్కొన్నారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను కట్టడి చేయాలన్న ప్రధాని రిషి సునాక్ (PM Rishi Sunak) ఆలోచలకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. బ్రిటన్‌లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న వారికి బ్రిటీష్ చట్టాల ప్రకారం 5ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది.

US Road Accident: అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు దుర్మరణం!


Updated Date - 2023-04-27T09:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising