Indian National: ఆఫీస్ పనులపై సౌదీ వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో విషాద ఘటన.. కువైత్‌లో భారతీయుడి స్పాట్ డెడ్!
ABN, First Publish Date - 2023-05-06T08:00:01+05:30
కువైత్‌లో (Kuwait) ఉండే ఓ భారతీయ వ్యక్తి (Indian National) ఆఫీస్ పనుల కోసం తన కారులోనే సౌదీ అరేబియా (Saudi Arabia)వెళ్లారు.
కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) ఉండే ఓ భారతీయ వ్యక్తి (Indian National) ఆఫీస్ పనుల కోసం తన కారులోనే సౌదీ అరేబియా (Saudi Arabia)వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని కేరళ రాష్ట్రానికి (Kerala State) చెందిన లాజి ఎం చెరియన్‌గా గుర్తించారు. కువైత్‌లోని ఎన్‌బీటీసీ కంపెనీలో జనరల్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో లాజి చెరియన్ మేనేజర్‌గా (Manager) విధులు నిర్వహిస్తున్నాడు.
కంపెనీ తరఫున సౌదీలో ఓ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం అతడు కారులో అక్కడికి వెళ్లారు. అక్కడ ఆఫీస్ పనులు ముగించుకుని తిరిగి కువైత్ వస్తున్న క్రమంలో ప్రమాదం బారిన పడ్డాడు. కారు ప్రమాదంలో లాజి చెరియన్ స్పాట్‌లోనే మృతిచెందాడు (Spot Dead). కాగా, కేరళలోని తిరువళ్లకు (Thiruvalla) చెందిన చెరియన్‌కు భార్య అనిత చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేదేన్ అన్నా చెరియన్ ఉన్నారు. సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైత్ పారిష్‌లో లాజి చెరియన్ క్రియాశీలక సభ్యుడు. ఈ ఘటనతో తిరువళ్లలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Dr Vivek Murthy: రోజుకి 15 సిగరెట్లు తాగడం కంటే కూడా.. అది చాలా ప్రమాదకరం.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన భారతీయ సర్జన్ జనరల్..!
Updated Date - 2023-05-06T08:00:01+05:30 IST