US: అయ్యో పాపం.. స్నేహితుడిని పికప్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన తెలుగు వ్యక్తి.. ఊహించని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు!
ABN, First Publish Date - 2023-04-04T11:05:10+05:30
అగ్రరాజ్యం అమెరికాలోని బోస్టన్‌లో (Boston) విషాద ఘటన చోటు చేసుకుంది.
బోస్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని బోస్టన్‌లో (Boston) విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ డేటా అనలిస్ట్ (Data Analyst) స్వదేశం నుంచి వస్తున్న స్నేహితుడిని పికప్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లి ఊహించని విధంగా ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల విశ్వచంద్ కొల్లా (Vishwachand Kolla)గా గుర్తించారు. మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (Logan International Airport) ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విశ్వచంద్ కొల్లా అనే తెలుగు ఎన్నారై తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు.
మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఇండియా నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి టెర్మినల్-బీ వద్ద వేచి ఉన్నాడని, అప్పుడే అతడిని ఒక బస్సు ఢీకొట్టినట్లు మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. విశ్వచంద్ కొల్లా తన కారు డ్రైవర్ వైపు నిలబడి ఉండగా అదే సమయంలో డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిందని ఆ రాష్ట్ర పోలీసు ప్రతినిధి డేవ్ ప్రోకోపియో మీడియాకు వెల్లడించారు.
దాంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించాలని చూశారు. కానీ, కొద్దిసేపటికే ప్రమాద స్థలంలోనే అతడు మృతి చెందినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ 54 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు పని చేస్తున్న టకేడా సంస్థ ఈ ప్రమాదంపై దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేసింది. విశ్వచంద్ కొల్లా అనూహ్య మరణం చాలా బాధకరమని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో విశ్వచంద్ కుటుంబానికి, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేసింది. అతడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. మరోవైపు విశ్వచంద్ బంధువులు, మిత్రులు 'గో ఫండ్ మీ' పేరుతో వెబ్‌పేజీని క్రియేట్ చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 4,06,151 డాలర్లు (రూ.33,398,663) జమ చేశారు. ఇలా వచ్చిన బాధితుడి కుటుంబానికి అందజేయనున్నారు.
Airfares: యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్.. లేకుంటే మీ జేబుకు చిల్లే..!
Updated Date - 2023-04-04T11:13:54+05:30 IST