US Spelling Bee: ప్రతిష్టాత్మక ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా 14 ఏళ్ల భారతీయ బాలుడు
ABN, First Publish Date - 2023-06-02T12:45:37+05:30
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు దేవ్ షా విజేతగా నిలిచాడు. 'PSAMMOPHILE' (శామాఫైల్) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పిన దేవ్.. టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ' (Scripps National Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు దేవ్ షా (Dev Shah) విజేతగా నిలిచాడు. 'PSAMMOPHILE' (శామాఫైల్) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పిన దేవ్.. టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. తద్వారా 50వేల డాలర్ల (రూ.41లక్షలు) నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఇక శామాఫైల్ అనే పదానికి అర్థం వచ్చేసి.. ఇసుక నేలల్లో కనిపించే జీవి లేదా మొక్క. తనకు దక్కిన ఈ భారీ విజయం పట్ల దేవ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తాను విజేతనయ్యానంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు.
ఈ పోటీల కోసం తన కుమారుడు నాలుగేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నట్లు దేవ్ తల్లి చెప్పారు. ఇక దేవ్ షా తండ్రి దేవల్ 29 ఏళ్ల క్రితం ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. కాగా, దేవ్ షా 2019, 2021లో నిర్వహించిన ‘స్పెల్లింగ్ బీ’ (Spelling Bee) పోటీల్లో కూడా పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలో నిలిస్తే, 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయినా పట్టుదలతో 2023లో ఛాంపియన్‌గా నిలిచాడు. గత 24 ఏళ్లల్లో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్ నిలిచాడు. గతేడాది కూడా మనోళ్లే ఈ పోటీల్లో విజేతగా నిలవడం విశేషం. టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్(14) విజేతగా నిలిస్తే.. మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12) రెండో స్థానంలో నిలిచాడు.
Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..
Updated Date - 2023-06-02T12:45:37+05:30 IST