ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదం రూపంలో ఎన్నారైని కబళించిన మృత్యువు

ABN, First Publish Date - 2023-10-17T08:01:58+05:30

అమెరికా (America) లో విషాదం చోటు చేసుకుంది. గత వారం ఇండియానాపోలీస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల ఎన్నారై (NRI) ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సుఖ్వీందర్ సింగ్‌ (Sukhwinder Singh) గా గుర్తించారు.

ఎన్నారై డెస్క్: అమెరికా (America) లో విషాదం చోటు చేసుకుంది. గత వారం ఇండియానాపోలీస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల ఎన్నారై (NRI) ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సుఖ్వీందర్ సింగ్‌ (Sukhwinder Singh) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్టోబర్ 13న ఎస్కేనాజీ హాస్పిటల్‌ (Eskenazi Hospital) లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇండియానాపోలిస్ (Indianapolis) సమీపంలోని గ్రీన్‌వుడ్ రూరల్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌ జిల్లాకు చెందిన సుఖ్వీందర్ సింగ్‌‌ 1996లో 15 ఏళ్ల వయసులో అగ్రరాజ్యానికి వలస వెళ్లాడు. ఆయన 2010 నుంచి ఇండియానా పోలిస్‌లో నివసిస్తున్నాడు. మృతుడికి భార్య, 15 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 12న సాయంత్రం రెండు వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో సుఖ్వీందర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో సింగ్ నడుపుతున్న హోండా అకార్డ్ (Honda Accord) ఎదురుగా ఉన్న లేన్‌లోకి వెళ్లి, క్యాడిలాక్ ఎస్కలేడ్‌ (Cadillac Escalade) పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగ్‌ను చికిత్స కోసం ఎస్కేనాజీ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక క్యాడిలాక్ (Cadillac) నడుపుతున్న డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో మహిళకు కూడా తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఐయూ హెల్త్ మెథడిస్ట్ హాస్పిటల్‌‌ (IU Health Methodist Hospital) కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, అమెరికాలో కొద్దినెలల క్రితం రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు యువతి జాహ్నవి కందుల దుర్మరణం పాలైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-17T08:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising