ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Singapore: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు.. చేసిన నేరమేంటంటే..!

ABN, First Publish Date - 2023-04-26T14:09:34+05:30

మలేషియా (Malaysia) నుంచి సింగపూర్‌కు అక్రమంగా పప్పీస్‌ను, పిల్లిని తరలించేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తికి (Indian origin) సింగపూర్ న్యాయస్థానం తాజాగా ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మలేషియా (Malaysia) నుంచి సింగపూర్‌కు అక్రమంగా పప్పీస్‌ను, పిల్లిని తరలించేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తికి (Indian origin) సింగపూర్ న్యాయస్థానం తాజాగా ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసును జంతువుల అక్రమ రవాణా (Smuggling Animals) అంశంలో అత్యంత తీవ్రమైన కేసుగా నేషనల్ పార్క్స్‌ బోర్డ్ (National Parks Board) పేర్కొంది. ఇలా అక్రమంగా తీసుకొచ్చిన కుక్క పిల్లలకు పార్వో వైరస్ సోకి ఇన్ఫెక్షన్‌తో 18 కుక్క పిల్లలు చనిపోయినట్లు పార్క్స్ బోర్డ్ తెలిపింది. ఇక నిందితుడిని గోబీసువరన్ పరమన్ శివన్‌ (Gobysuwaran Paraman Sivan) లైసెన్స్ లేకుండా పెంపుడు జంతువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడంతో పాటు వాటికి బాధ కలిగించినందుకు అతడికి న్యాయస్థానం 12 నెలల జైలు శిక్ష విధించింది.

గోబీసురవన్ గతేడాది అక్టోబర్ 18న మలేషియా నుంచి ఒక లారీలో 26 కుక్క పిల్లలు, ఒక పిల్లిని అక్రమంగా సింగపూర్‌కు తరలించాడు. మలేషియా దక్షిణ ద్వీపకల్పం నుంచి సింగపూర్ (Singapore) వైపు వచ్చే బ్రిడ్జ్ వద్ద టువాస్ చెక్ పాయింట్‌లో (Tuas Checkpoint) విధులు నిర్వహిస్తున్న అధికారులు మలేషియా రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీని ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో లారీలోని వివిధ కంపార్ట్‌మెంట్‌లలో దాచి తరలిస్తున్న 27 పెంపుడు జంతువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్నింటిని లాండ్రీ బ్యాగులలో కుక్కి లారీ ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లలో ఉంచారు. మరి కొన్నింటిని ప్లాస్టిక్ కంటైనర్‌లలో డ్రైవర్, ప్రయాణీకుల సీట్ల వెనుక దాచి పెట్టారు. ఒకవేళ ఈ కుక్క పిల్లలను విక్రయించినట్లయితే కుక్కలకు సోకే పార్వో వైరస్ సమాజంలోని ఇతర కుక్కలకు వ్యాపించి ఉండేదని నేషనల్ పార్క్స్ బోర్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Neeli Bendapudi: భారతీయ అమెరికన్ తెలుగు మహిళా విద్యావేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం


Updated Date - 2023-04-26T14:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising